AP MPTC ZPTC Elections Results: గుంటూరు జిల్లాలో తడిసిన బ్యాలెట్ పేపర్లు.. శ్రీకాకుళంలో చెదలు..
Andhra Pradesh Elections Results live updates: ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో గుంటూరు
Andhra Pradesh Elections Results live updates: ఏపీ వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో గుంటూరు జిల్లా తాటికొండ మండలం బేజాత్‌పురం, రావెల ఎంపీటీసీ స్థానాల్లో కౌంటింగ్ నిలిచిపోయింది. లెక్కింపు కోసం బాక్సులు ఓపెన్ చేయగా.. అందులోని బ్యాలెట్ పేపర్లు తడిసిపోయి కనిపించాయి. ఇన్నాళ్లు స్ట్రాంగ్‌రూమ్‌లలో భద్రంగా ఉన్న బ్యాలెట్ బాక్సుల్లోకి నీళ్లు ఎలా చేరాయంటూ కౌంటింగ్ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రీ పోలింగ్ జరపాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో పోలింగ్ సిబ్బంది ప్రస్తుత పరిస్థితిపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతోపాటు విశాఖపట్నం జిల్లా తూటిపాల, పాపయ్యపాలెంలో కూడా కౌంటింగ్ ప్రక్రియ ఆగిపోయింది. బ్యాలెట్ బాక్సుల్లో నీరు చేరడంతో కౌంటింగ్ నిలిపివేశారు అధికారులు. ఆ తర్వాత ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. దీనిపై కలెక్టరుకు సమాచారం అందించామని తదుపరి ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నట్లు అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం షలంతరి ఎంపిటిసి స్థానానికి సంబంధించిన పోలింగ్ బాక్సులకు చెదలు పట్టింది. దీంతో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ చెదలుపట్టిన బ్యాలెట్లపై విచారణకు ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో చెదలుపట్టిన బూత్ లోని బ్యాలెట్లను అధికారులు పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు.
ప్రకాశం జిల్లా కనిగిరి కౌంటింగ్ కేంద్రంలో ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. పామూరు మండలం 5వ ఎంపిటిసి ఎలక్షన్ కౌంటింగ్‌పై వైసీపీ, సీపీఎం ఏజెంట్ల మధ్య వాగ్వాదం నడిచింది. బ్యాలెట్ బాక్స్ టేబుల్‌పైన పెట్టి తర్వాత కింద పెట్టడంపై సీపీఎం ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తంచేశారు. బ్యాలెట్ బాక్స్‌ను తిరిగి టేబుల్‌పై పెట్టాలని సీపీఎం ఏజెంట్ల పట్టుబట్టారు.
Also Read: