ఆయన సీఎం అయ్యేది లేదు.. ఈయన హోంమంత్రి అయ్యేది లేదు.. అయ్యన్న వ్యాఖ్యలకు వైసీపీ నేతల కౌంటర్స్..

చంద్రబాబు సీఎం అయ్యేది లేదు.. అయ్యన్న హోం మంత్రి కాబోయేది లేదు.. ఇదీ అయ్యన్న పాత్రుడి హాట్ కామెంట్స్ కి వైసీపీ ఇస్తోన్న స్ట్రాంగ్ కౌంటర్స్. తాజాగా టీడీపీ నేత అయ్యన్న..

ఆయన సీఎం అయ్యేది లేదు.. ఈయన హోంమంత్రి అయ్యేది లేదు.. అయ్యన్న వ్యాఖ్యలకు వైసీపీ నేతల కౌంటర్స్..
Mopidevi Venkataramana

Updated on: Jan 21, 2023 | 7:54 AM

చంద్రబాబు సీఎం అయ్యేది లేదు.. అయ్యన్న హోం మంత్రి కాబోయేది లేదు.. ఇదీ అయ్యన్న పాత్రుడి హాట్ కామెంట్స్ కి వైసీపీ ఇస్తోన్న స్ట్రాంగ్ కౌంటర్స్. తాజాగా టీడీపీ నేత అయ్యన్న మాట్లాడుతూ పోలీసులపై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే బుడి ముత్యాలనాయుడు కౌంటర్స్ ఇచ్చారు. అయ్యన్న కలలు నెరవేరవని అంటున్నారు.

అయ్యన్న పాత్రుడు పోలీసులపై చేసిన సంచలన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి వరుస కౌంటర్లు పడుతున్నాయ్. అయ్యన్నకు చంద్రబాబులాగానే మతి భ్రమించిందని కామెంట్ చేశారు ఎంపీ మోపిదేవి. నిజాంపట్నం మండలం, పల్లపట్లలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. అయ్యన్న వ్యాఖ్యలపై స్పందించారు. చంద్రబాబు.. సీఎం అయ్యేది లేదు. అయ్యన్నకు హోంమంత్రి పదవి వచ్చేది లేదు.. ముఖ్యమంత్రి అవుతానంటూ చంద్రబాబు కలలు కంటుంటే.. అయ్యన్న తానేకంగా హోం మంత్రి అవుతానని కలలు కంటున్నారని వ్యాఖ్యానించారు మోపిదేవి. ఈ కలలు సాకారమయ్యే ప్రసక్తే లేదనీ అన్నారు ఎంపీ మోపిదేవి.

అయ్యన్న పాత్రుడి కామెంట్లపై మాడుగుల ఎమ్మెల్యే బుడి ముత్యాలనాయుడు సైతం రియాక్టయ్యారు. అప్పుడే ఎన్నికలైనట్టు.. తానేదో హోం మంత్రి పదవి పొందినట్టు అయ్యన్న మాట్లాడుతున్నారు. అయ్యన్న మాట్లాడే మాటలకు ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. అన్నారు ఎమ్మెల్యే బుడి. టీడీపికివే చివరి ఎన్నికలనీ.. అయ్యన్న కలల నుంచి వాస్తవ ప్రపంచంలోకి రావాలనీ.. నాలుగు రోజులు ఆగితే ఏ పోలీసుల బట్టలైతే ఊడదీస్తామని అన్నారో.. వారే అయ్యన్న బట్టలు ఊడదీస్తారనీ గట్టి కౌంటర్ అటాక్ చేశారు వైసీపీ నాయకులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..