Andhra Pradesh: సుప్రీంకోర్టులో ఏపీకి ఝలక్.. జీవో నెంబర్ 1 పై ధర్మాసనం ఏమందంటే..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జీవో నంబర్‌ 1 విషయంలో జోక్యం చేసుకోలేమని సుంప్రీకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1 విషయంలో..

Andhra Pradesh: సుప్రీంకోర్టులో ఏపీకి ఝలక్.. జీవో నెంబర్ 1 పై ధర్మాసనం ఏమందంటే..
Supreme Court Of India
Follow us

|

Updated on: Jan 21, 2023 | 7:30 AM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జీవో నంబర్‌ 1 విషయంలో జోక్యం చేసుకోలేమని సుంప్రీకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1 విషయంలో ప్రస్తుత పరిస్థితిలో జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లపై సభలు, రోడ్డుషోలు, సమావేశాలను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 1పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే, హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు.

ఈ జీవోపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. భావప్రకటనా స్వేచ్ఛను హరించేలా ఈ జీవో ఉందని ఆరోపించారు. రామకృష్ణ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, జీవోను జనవరి 23వ తేదీ వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. తదుపరి విచారణ జనవరి 23కి తేదీకి వాయిదా వేసింది. కానీ, జీవో విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం ఈ జీవో జారీచేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. గుంటూరు, కందుకూరు ఘటనను సూచిస్తూ , ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా, వారి ప్రాణాలు కాపాడడానికే జీవో జారీ చేశామని తెలిపింది. రూల్స్‌ అతిక్రమిస్తే కఠినచర్యలు తప్పవని జీవోలో పేర్కొంది.

హైకోర్టు స్టేను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసినా.. మళ్లీ హైకోర్టు విచారణకే సూచించింది సుప్రీంకోర్టు. దీంతో.. హైకోర్టులో విచారణ ఎలా ఉండబోతోంది? ఎలాంటి నిర్ణయాన్ని వెలువరిస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు సుప్రీంతీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని ట్వీట్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..