Vande Bharat Train: విశాఖలో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి.. ఆ ముగ్గురే ఈ పని చేశారా..?
విశాఖలో వందే భారత్ ట్రైన్‌పై రాళ్లు రువ్విన ఘటనను రైల్వేతో పాటు ఇటు నగర పోలీస్ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ట్రైన్‌పై దాళ్లదాడి వెనుక విద్రోహక శక్తుల కుట్ర ఉందేమో ఆన్న బీజేపీ..
విశాఖలో వందే భారత్ ట్రైన్‌పై రాళ్లు రువ్విన ఘటనను రైల్వేతో పాటు ఇటు నగర పోలీస్ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ట్రైన్‌పై దాళ్లదాడి వెనుక విద్రోహక శక్తుల కుట్ర ఉందేమో ఆన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అనుమానాలతో పోలీసులపై మరింత ఒత్తిడి పెరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. వీరికోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న మోదీ సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ ప్రారంభించాల్సి ఉండగా.. 4 రోజుల ముందుగానే ప్లాన్ చేశారు. ఈలోపు ఇదే ట్రైన్ ట్రయల్ రన్ కోసం చెన్నై ఇంటిగ్రేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి నేరుగా విశాఖ వచ్చింది. ఇవాళ విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంది. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో సాధారణ మెయింటెనెన్స్ కోసం కోచ్ కేర్ సెంటర్ కు తరలిస్తున్న సందర్భంలో కంచరపాలం సమీపంలో రామ్మూర్తి పంతులు గేటు వద్ద కొందరు అగంతకులు ట్రైన్ పైకి రాళ్ళు విసిరారు. దీంతో ఒక కోచ్ కు చెందిన రెండు గ్లాస్ లు పగిలిపోయాయి. ఈ ఘటనతో నగర పోలీస్ అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ దాడి కేసులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. శంకర్, దిలీప్, చందు అనే వ్యక్తులను అనుమానితులుగా గుర్తించారు. మద్యం మత్తులో రాళ్లు రువ్వారా లేక వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు పోలీసులు.
నిందితులపై గతంలో కూడా హత్యాయత్నం, పలు రైల్వే కేసులు ఉన్నట్లు గుర్తించారు. గంజాయి మత్తులో చేశారా, లేక ఉద్దేశపూర్వకంగా చేశారా అన్నది విచారణలో తేలుతుందన్నారు పోలీసులు. కాగా దుశ్చర్యకు పాల్పడ్డ వాళ్లు దేశ ద్రోహులు అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..