Girls – Police: హెల్మెట్ లేకుండా దొరికిన అమ్మాయిలు.. పోలీసుల రియాక్షన్‌పై అబ్బాయిల ఆగ్రహం.!వీడియో వైరల్..
హెల్మెట్ లేకుండా బైక్ నడపడం చట్టరీత్యా నేరం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ.. ట్రాఫిక్ పోలీసులకు గనక దొరికితే ఫైన్ కట్టాల్సిందే. ఒక్కోసారి బైక్ కూడా సీజ్ చేస్తుంటారు. అయితే..
తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు అమ్మాయిలు హెల్మెట్ లేకుండా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారితో సదరు పోలీసులు ప్రవర్తించిన తీరుకు అబ్బాయిలు కోపంతో రగిలిపోతున్నారు. హెల్మెట్ లేకుండా అబ్బాయిలు దొరికితే ఒక న్యాయం.? అమ్మాయిలకు మరో న్యాయమా.? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. స్థానిక బదౌన్ నగరంలో ఇద్దరు అమ్మాయిలు స్కూటీపై హెల్మెట్ లేకుండా పోలీసులకు దొరికారు. వాళ్లతో పోలీసులు నవ్వుతూ మాట్లాడారు. ‘హెల్మెట్ పెట్టుకోకుండా లైఫ్‌ని ఎందుకు రిస్క్‌లో పెడతారంటూ’ నవ్వుతూ ఆప్యాయంగా ఆ అమ్మాయిలతో పోలీసులు మాట్లాడిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన అబ్బాయిలు ఫైర్ అవుతున్నారు. అబ్బాయిలతో ఏ పోలీస్ అయినా అలా మాట్లాడతాడా? అంత వివక్ష ఎందుకు?, అబ్బాయిలకు వేసిన జరిమానాలతో పోల్చుకుంటే అమ్మాయిలకు 10 శాతం జరిమానా కూడా వేసి ఉండరు. రూల్స్ అన్నీ అబ్బాయిలకే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

