Guntur: అప్పులెక్కువయ్యాయని కిడ్నీ అమ్మాలనుకున్న అమ్మాయి.. కట్ చేస్తే
ఇదో మాయా ప్రపంచం. ఎటు చూసినా మోసమే. తాజాగా తన అప్పులు తీర్చుకునేందుకు కిడ్నీ అమ్మడానికి సిద్దపడిన ఓ అమ్మాయి మరిన్ని చిక్కుల్లో పడింది.
బీ అలెర్ట్. సోషటీ అంతా మోసంతో నిండిపోయింది. గుంట నక్కలు ఎక్కడబడితే అక్కడ మీపై అటాక్ చేయడానికి కాచుకు కూర్చుని ఉన్నాయి. అది మానసికంగా అవ్వొచ్చు. శారీరకంగా అవ్వొచ్చు. సైబర్ కేటుగాళ్లు అయితే చాపకింద నీరులా పని కానిచ్చేస్తున్నారు. చిన్న లూప్ దొరికినా చాలు.. మీ ఖాతాల్లోని సొమ్ము ఖతం చేస్తున్నారు. పాపం ఇప్పుడు మీకు ఓ పిచ్చితల్లి గురించి చెప్పాలి. ఆమెది గుంటూరు జిల్లా. పూర్తి వివరాలు చెప్పదలుచుకోవడం లేదు. తనకి అప్పులయ్యాయి. ఇంట్లో చెప్పాలంటే భయం వేసింది. ఏమంటారో అని భయపడింది. ఈ సమయంలోనే ఆమెకు యూట్యూబ్‌లో కిడ్నీ డొనేషన్ యాప్ అని కనిపించింది. దీంతో ఆ అమ్మాయి దృష్టి దానిపైకి మళ్లింది. వెంటనే ఆ నంబర్‌కు మెసేజ్ చేసింది. తాను కిడ్నీ ఇస్తానని తెలిపింది. ప్రతిగా 6 కోట్లు ఇస్తామని అవతలి నుంచి డీల్ వచ్చింది. ఆల్ సెట్.
ముందు 3 కోట్లు.. ఇచ్చాక చేశాక 3 కోట్లు ఇస్తామని బేరం కుదుర్చుకున్నారు. ఇక్కడే అసలు డ్రామా షురూ చేశారు. ఒక ఫేక్ ఆన్‌లైన్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో 3 కోట్లు ఆమె పేరుతో వేసినట్లు చూపారు. అవి ఆమె అకౌంట్‌కు బదిలీ అయ్యేందుకు ట్యాక్సులు, ఇతర ఖర్చులు పేరుతో దాదాపు 16 లక్షలు గుంజేశారు. మళ్లీ లక్షా 15 వేలు కావాలని అడిగారు. దీంతో ఆమెకు విసుగు వచ్చింది. తాను కిడ్నీ ఇవ్వనని.. తన డబ్బు రిటన్ ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఢిల్లీ వస్తే.. ఇస్తామని ఓ అడ్రస్ ఇచ్చారు. ఆమె అక్కడి వెళ్లి చూడగా.. అలాంటి హాస్పిటల్ లేనే లేదు.
దీంతో మోసపోయానని గ్రహించి.. ఇంట్లో వాళ్లకు విషయం చెప్పింది. తాజాగా తండ్రితో కలిసి వచ్చి ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేసింది. చూశారా ఆ అమ్మాయిని ఎలా చీట్ చేశారో..? అంతా మోసమే. ఇంకా నయం.. ఢిల్లీ వెళ్లినప్పుడు కిడ్నీ కూడా తీసుకోలేదు. అది సంతోషించదగ్గ విషయం. అదీ తీసుకుని.. నడిరోడ్డుపై వదిలేస్తే.. చేసేది కూడా ఏమీ లేదు. తస్మాత్ జాగ్రత్త.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..