AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఒంగోలులో మహిళ దారుణ హత్య.. కేవలం పుర్రె, ఎముకలు మాత్రమే..

ఒంగోలు సమీపంలోని బైపాస్‌ రోడ్డు పక్కన కాలిపోయిన స్థితిలో మరో మృతదేహం లభ్యమైంది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో నాలుగైదురోజుల క్రితం కాల్చివేసినట్టు అస్థిపంజరం ఆనవాళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. మృతదేహం మహిళదిగా అనుమానిస్తున్నారు. ఈనెల ఒకటో తేదిన ఇదే బైపాస్‌ సమీపంలో ఒకరి మృతదేహం..

Andhra Pradesh: ఒంగోలులో మహిళ దారుణ హత్య.. కేవలం పుర్రె, ఎముకలు మాత్రమే..
Women Murder
Basha Shek
|

Updated on: May 13, 2023 | 6:45 AM

Share

ఒంగోలు సమీపంలోని బైపాస్‌ రోడ్డు పక్కన కాలిపోయిన స్థితిలో మరో మృతదేహం లభ్యమైంది. పూర్తిగా కాలిపోయిన స్థితిలో నాలుగైదురోజుల క్రితం కాల్చివేసినట్టు అస్థిపంజరం ఆనవాళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి. మృతదేహం మహిళదిగా అనుమానిస్తున్నారు. ఈనెల ఒకటో తేదిన ఇదే బైపాస్‌ సమీపంలో ఒకరి మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో పోలీసులు గుర్తించారు. అనంతరం పదిరోజుల తరువాత మరో మహిళ మృతదేహం ఇదే తరహాలో కాలిపోయి ఆనవాళ్ళు లేకుండా కనిపించడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. పదిరోజుల వ్యవధిలో రెండు మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో లభ్యం కావడంతో ఈరెండు మృతదేహాలకు లింకు ఉందా అన్న కోణంలో పోలీసులు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం లభించిన మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కేవలం పుర్రె, ఎముకలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఎముకల నిర్మాణాన్ని బట్టి మృతదేహం మహిళదిగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో లభించిన ఎముకలను పోలీసులు సేకరించారు. వరుసగా ఇదే ప్రాంతంలో రెండు మృతదేహాలు ఒకే విధంగా కాలిపోయిన స్థితిలో లభ్యం కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.  ఒంగోలు బైపాస్‌ రోడ్డుపై హైవే పెట్రోలు వాహనాలు, నైట్‌ బీట్‌ పోలీసు వాహానాలు నిత్యం తిరుగుతున్నా పోలీసులు ఈ రెండు మృతదేహాలను గుర్తించలేకపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ రెండు మృతదేహాలను పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

10 రోజుల వ్యవధిలో..

ఒంగోలు సమీపంలోని పిఎల్‌ఆర్‌ కళ్యాణమండపం వెనుకవైపు నిర్జన ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ఈనెల ఒకటో తేదిన స్థానికులు గుర్తించారు. పూర్తిగా కాలిపోయిన స్తితిలో ఉన్న మృతదేహం పడి ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం సమీపంలో పెట్రోల్‌ బాటిల్‌, అగ్గిపెట్టెలను గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయి ఆనవాళ్ళు లేకుండా ఉంది. మృతదేహానికి సమీపంలో ఒక మనీపర్సు దొరికింది. అయితే అందులో ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులకు ఈ మృతదేహం వ్యవహారం పెద్ద మిస్టరీగా మారింది. మృతదేహం ఎవరిదో తెలుసుకునేందుకు డాగ్‌ స్క్వాడ్‌ సహాయం తీసుకున్నారు. పోలీస్‌ డాగ్‌ ఘటనా స్థలంలో కొద్దిదూరం వెళ్ళి తిరిగి వచ్చేసింది. ఎక్కడో చంపేసి ఇక్కడకు తీసుకొచ్చి తగులబెట్టారా, లేక ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఈ గుర్తు తెలియని మృతదేహం వ్యవహారం ఒక కొలిక్కి రాకముందే ఇదే బైపాస్ రోడ్డు సమీపంలో మరో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.ఈ రెండు ఘటనల్లో ఎక్కడో చంపి ఇక్కడకు తీసుకొచ్చి కాల్చేశారా. అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ వరుస ఘటనల వెనుక ఒక్కరే ఉన్నారా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ రెండు హత్యల మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. ఈ ఘటనపై మాట్లాడేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. త్వరలోనే ఈ రెండు కేసులను ఛేధించి వివరాలు అందిస్తామంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..