ఏపీలో పసుపు పండుగకు సర్వం సిద్ధమైంది. రేపు, ఎల్లుండి రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో టీడీపీ మహానాడు జరగబోతోంది. వంద ఎకరాల్లో మహానాడు ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. వేదికపై 320 మంది టీడీపీ నేతలు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పు సెంటిమెంట్‌తో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడుకు ప్రజలు లక్షలాదిగా తరలిరానున్న నేపథ్యంలో రాజమండ్రి పసుపుమయమైంది. రాజమండ్రి నగరం టీడీపీ తోరణాలతో కళకళలాడిపోతోంది. ఇక.. నేటి నుంచి 3 రోజులపాటు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇవాళ సాయంత్రం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొననున్నారు. రాత్రికి వేమగిరిలో బస చేయనున్న చంద్రబాబు.. రేపు, ఎల్లుండి మహానాడులో పాల్గొననున్నారు.
టీడీపీ మహానాడుకు తెలుగురాష్ట్రాలతోపాటు దేశవిదేశాల నుండి ప్రతినిధులు పెద్దఎత్తున తరలిరానున్నారు. దాంతో.. రాజమండ్రిలోని ప్రముఖ హోటల్సన్నీ దాదాపుగా బుక్కయినట్లు తెలుస్తోంది. ప్రముఖ మంజీరా, సెల్టన్ హోటల్స్‌లో 100కు పైగా రూములను మూడు రోజులపాటు బుక్ చేసుకున్నారు టీడీపీ నేతలు. 15 నుంచి 20 వరకూ ఉన్న చిన్నచిన్న హోటల్స్‌లోనూ అన్ని రూములు బుక్ అయిపోయాయి. అంతేకాదు.. రాజమండ్రి చుట్టుపక్కల హోటల్స్‌లోనూ రూములు బుక్కయిపోయినట్లు చెప్తున్నారు నిర్వహకులు.
ఇదిలావుంటే.. రాజమండ్రిలో టీడీపీ మహానాడు ఓ మోసమన్నారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్. మూడు విషయాల్లో పశ్చాత్తాపపడుతూ చంద్రబాబు మహానాడులో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఓ వైపు వెన్నుపోటు పొడిచి.. మరోవైపు ఎన్టీఆర్ శతజయంతోత్సవాలు నిర్వహిస్తుండటం చంద్రబాబుకే చెల్లుతుందని విమర్శించారు రాజమండ్రి ఎంపీ భరత్.
వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి బంపరాఫర్ ఇస్తున్నారన్నారు అచ్చెన్నాయుడు. టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తాయనగానే వైసీపీలో భయం మొదలైందని.. అందుకే విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఎమ్మెల్యేలు కోపంతో ఉన్నారంటూ అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
మొత్తంగా.. టీడీపీ మహానాడు రాజమండ్రి రాజకీయాల్లో కాకరేపుతోంది. వైసీపీ-టీడీపీ నేతల మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. మహానాడులో టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
మరిన్ని ఏపీ వార్తల కోసం..