Monsoon: ఏపీ వాసులకు ‘చల్లని’ కబురు.. రాయలసీమను తాకిన రుతుపవనాలు.. మరో 2 రోజుల్లోనే

|

Jun 12, 2023 | 6:40 PM

నైరుతి రుతు పవనాలు రాయలసీమలోని ప్రవేశించాయి. ఆదివారం రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు తాకిటన్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 48 గంటల్లో రాయలసీమ అంతటా వ్యాపించే అవకాశం..

Monsoon: ఏపీ వాసులకు చల్లని కబురు.. రాయలసీమను తాకిన రుతుపవనాలు.. మరో 2 రోజుల్లోనే
Monsoon
Follow us on

అమరావతి: నైరుతి రుతు పవనాలు రాయలసీమలోని ప్రవేశించాయి. ఆదివారం రాయలసీమలోని పలు ప్రాంతాలను రుతుపవనాలు తాకిటన్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో 48 గంటల్లో రాయలసీమ అంతటా వ్యాపించే అవకాశం ఉంది. మే 8వ తేదీన రుతు పవనాలు కేరళను తాకిన సంగతి తెలిసిందే. సాధారణంగా కేరళలోకి ప్రవేశించని తర్వాత ఏపీని తాకడానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. జూన్‌ 12 నాటికి రుతు పవనాలు ఏపీకి రావల్సి ఉంది. ఐతే ఈసారి ఒకరోజు ముందుగానే ఏపీలోకి ప్రవేశించాయి. బిపర్‌జోయ్‌ తుపాను కారణంగా అవి చురుగ్గా కదలడంవల్ల ముందుగానే రాష్ట్రాన్ని తాకాయి.

రానున్న వారం రోజుల్లో మొత్తం రాష్ట్రమంతా విస్తరిస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించే వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు, వడగాల్పులు కొనసాగనున్నాయి. సోమవారం 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 184 మండలాల్లో వడగాల్పులు వీశాయి. మన్యం జిల్లా సాలూరులో అత్యధికంగా 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం 43 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 266 మండలాల్లో వడగాల్పులు, బుధవారం 56 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 294 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలుచోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఇక తిరుమలలో ఆదివారం ఉదయం నుంచే ఆకాశమంతా మబ్బులతో నిండిపోయింది. తీవ్ర ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ ప్రజలకు కాస్త ఉపశమనం లభించినట్లైంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి.