Andhra News: ఏపీ ప్రజలకు అదిరే గుడ్‌న్యూస్.. ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సూర్యఘర్ యోజన పథకంపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకాన్ని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉచితంగా వర్తింపచేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇక బీసీలకు రాయితీ అందిస్తామని తెలిపారు.

Andhra News: ఏపీ ప్రజలకు అదిరే గుడ్‌న్యూస్.. ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన
Ap Government

Updated on: Dec 14, 2025 | 8:01 PM

ఇంటిపై సౌర విద్యుత్ తక్కువ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సూర్యఘర్ యెజన పథకాన్ని గతంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పధకం కూడా సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలంటే కేంద్రం భారీగా రాయితీ ఇస్తోంది. అంతేకాకుండా బ్యాంకుల నుంచి లోన్లు కూడా ఇప్పిస్తుంది. మీ ఇంటికి అవసరయ్యే విద్యుత్‌ను మీరు దీని ద్వారా ఉత్పత్తి చేసుకోవచ్చు. అయితే ఈ పథకం అమల్లో ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. తాజాగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ప్రకటన చేశారు. దళితులు,గిరిజనులు, వెనుకబడిన వర్గాల ప్రజలకు ఈ పథకాన్ని ఉచితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఎస్సీ, ఎస్టీలకు ఉచితం

ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించనుండగా.. బీసీలకు పెద్ద మొత్తంలో రాయితీ కల్పించనున్నారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే సచివాలయాన్ని సందర్శించి కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చని సూచించారు. కేంద్ర ప్రవేశపెట్టిన ఈ పధకం ద్వారా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని తెలిపారు. దేశవ్యాప్తంగా కోటిమందికి ఈ పథకం వర్తింపచేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు.

రాయితీ ఎలా..?

ఈ పధకం ద్వారా మీ ఇంటిపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటే కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తుంది. ఉదాహరణకు మీరు 3 కిలోవాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలంటే రూ.1.50 లక్షలు ఖర్చు అవుతుందని అనుకుంటే.. అందులో రాయితీ ద్వారా మీకు రూ.70 వేలు అందుతాయి. ఇక మిగతా సొమ్ము మీరు పెట్టుకుని ఏర్పాటు చేసుకోవాలి. pmsuryaghar.gov.in వెబ్ సైట్‌లోకి వెళ్లి అప్లికేషన్ పెట్టుకుంటే అధికారులు మీకు అనుమతి మంజూరు చేస్తారు. ఆ తర్వాత కొత్త మీటర్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా మీరు ఉచితంగా కరెంట్ సౌకర్యం పొందవచ్చు.