Andhra Pradesh: ఏపీలో పొలిటికల్ హీట్.. అన్ని పార్టీల చూపు 2024 పైనే..
ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. 2024 టార్గెట్‌గా .. అధికారం కోసం అన్ని పార్టీలు ఎవరి రూట్‌లో వాళ్లు స్కెచ్చులేస్తున్నారా.. వచ్చే ఎన్నికల్లోగా.. జగన్ క్యారెక్టర్ మీద ప్రజల్లో అనుమానం కలిగించేలా కుట్ర జరుగుతోందా..
ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది. 2024 టార్గెట్‌గా .. అధికారం కోసం అన్ని పార్టీలు ఎవరి రూట్‌లో వాళ్లు స్కెచ్చులేస్తున్నారా.. వచ్చే ఎన్నికల్లోగా.. జగన్ క్యారెక్టర్ మీద ప్రజల్లో అనుమానం కలిగించేలా కుట్ర జరుగుతోందా.. బీజేపీలోని స్లీపర్ సెల్స్ ఈ కుట్ర వెనుక దాగున్నాయా.. వివేకా హత్యకేసు దర్యాప్తులోసీబీఐ ఇన్‌ఫర్మేషన్ ఎలా లీకవుతోంది.. వైసీపీ ఏమంటోంది.. ఇంట్రస్టింగ్ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
ఏపీలో పొలిటికల్ హీట్..
అధికారం కోసం అధికార పార్టీ సంక్షేమాన్ని నమ్ముకుంటే.. ప్రతిపక్ష పార్టీ పాదయాత్రను నమ్ముకుంటోంది. బీజేపీ, జనసేన ఎవరి దారుల్లో వాళ్లు వెళ్తున్నారు. పొత్తులు కన్ఫామ్ కాకపోయినా ఎన్నికలపై అన్ని పార్టీలదీ ఒక విజన్ అయితే ఉండనే ఉంది. ఇదంతా ఓకే.. మరి స్లీపర్‌సెల్స్ మాటేంటి.. ఇదే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్.
జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేసే దిశగా కుట్ర..?
2024లో జగన్ అధికారంలోకి రాకుండా ఉండేందుకు పావులు కదుపుతున్నారని.. రకరకాల ఊహాగానాలు స్టేట్ రౌండప్ చేస్తున్నాయి. జగన్ క్యారెక్టర్‌ను డ్యామేజ్ చేయాలని, ఆయనపై ప్రజల్లో అనుమానం కలిగేలా సిచ్యుయేషన్ క్రియేట్ చేయాలని కుట్ర జరుగుతోందని వినిపిస్తోంది. దీనికంతటికీ చంద్రబాబే కారణమంటున్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించాలని చంద్రబాబు అనేక కుట్రలు చేస్తున్నారని.. ఇవన్నీ ప్రజలకు తెలుసని ఆయన చెబుతున్నారు.
ఏపీలో రాజకీయం పొయ్యిమీద కుండలోని నీళ్లలా కుతకుతకుతమని ఉడుకుతోంది. ఏ పార్టీ ఏచిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ప్రతి పాయింట్‌పైనా ఫోకస్ పెడుతోంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిపై బీజేపీ స్లీపర్ సెల్స్ ఎందుకిలా చేస్తున్నాయోనని వైసీపీ నేతలు ఆరా తీస్తున్నారు.
చంద్రబాబు వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారన్న సజ్జల..
ఇంత దారుణానికి ఒడిగట్టేది చంద్రబాబేనని సజ్జల చెబుతున్నారు. చంద్రబాబు మాత్రమే మొదటి నుంచీ వ్యవస్థలను తీవ్రస్థాయిలో ప్రభావితం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. లేకపోతే.. సీబీఐ ఇన్ఫర్మేషన్ వీళ్లకే ముందు ఎలా తెలుస్తుందని.. ఎలా లీకవుతుందని ప్రశ్నిస్తున్నారు సజ్జల. ఎవరెన్ని చేసినా జగన్‌ను ఎవరూ ఏమీ చేయలేరని చెబుతున్నారు సజ్జల.
ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, నవీన్‌ల విచారణపై తప్పుడు ప్రచారం..
వివేకా హత్య కేసులోనే చూస్తే.. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, నవీన్‌ల విచారణపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం దంపతులతో మాట్లాడేందుకు కాల్స్..?
ఎంపీ అవినాష్ రెడ్డి.. వైఎస్ భారతి, సీఎం జగన్‌తో మాట్లాడేందుకు ఎక్కువసార్లు ప్రయత్నించారని, అందులో భాగంగానే భారతి పీఏ నవీన్‌కు, జగన్ ఓఎస్డి కృష్ణమోహన్‌కీ ఆయన ఫోన్ చేసినట్లు కాల్‌డేటా ఆధారంగా సీబీఐ గ్రహించినట్టు సమాచారం. అందులో భాగంగానే భారతి పీఎ నవీన్‌ను, సీఎం ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది. కడపలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ వీళ్లిద్దరికీ ఈనెల 1న వాట్సప్ ద్వారా మెసేజ్ ఇచ్చింది సీబీఐ. హత్య జరిగిన రోజు ఎంపీ అవినాష్‌రెడ్డి మీకిద్దరికీ ఫోన్లు చేశారా… ఒకవేళ చేసిఉంటే ఏం మాట్లాడారు.. అని ఆరా తీసినట్టు తెలుస్తోంది. కాల్ డేటా ఆధారంగా గతంలో ఎంపీ అవినాష్ రెడ్డి మాజీ డ్రైవర్ హరిప్రసాద్‌ని కూడా విచారణకు పిలిచినట్టు సమాచారం.
అయితే.. ఆనాడు వాళ్లు జగన్‌కు సమాచారం తెలియచేయడానికి మాత్రమే ఫోన్ చేసినట్లు ఎంత స్పష్టమవుతున్నా.. అందులో ఏదో ఉందని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు.
ఇక ఫోన్ ట్యాపింగ్ రచ్చ ఏపీ రాజకీయాల్లో ఎంత దుమారం రేపుతోందో తెలిసిందే.. దీనిపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అవుతుంటే.. ఫోన్‌ట్యాపింగ్ డ్రామా ఆడిస్తోంది కూడా చంద్రబాబేనని సజ్జల అటాక్ చేశారు.
ఎవరు ఏం చేసినా.. అంతా లోకకల్యాణం కోసమే అన్నట్లు.. అన్ని పార్టీల నేతలు.. ఎవరికి తగినట్లు వాళ్లు రాజకీయాలు చేస్తున్నారు. వివేకా హత్యకేసు చివరికి ఏ తీరం చేరుతుందో కానీ.. ప్రస్తుతానికి మాత్రం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఫోన్‌ట్యాపింగ్ యవ్వారం వైసీపీకి ఎంత మైనస్ అవుతుందో తెలియదు కానీ.. మొత్తానికి కాస్త డ్యామేజ్ అవుతోందని మాత్రం వినిపిస్తోంది. ఇక స్లీపర్‌సెల్స్ కుట్ర కోణం ఎప్పుడు ఎలా బయటపడుతుందో..అసలు ఎలా ఉంటుందో కూడా అంతుబట్టని విషయమని రాజకీయ పండితుల అంచనా.
మరిన్నిఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..