AP News: మంగళగిరిలో అదృశ్యమైన యువతి.. కలకలం సృష్టిస్తున్న సెల్ఫీ వీడియో.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!

Andhra Pradesh: ఓ యువతి పంపిన సెల్ఫీ వీడియో మంగళగిరిలో కలకలం సృష్టించింది. ఆ వీడియోతో అలర్ట్ అయిన పోలీసులు..

AP News: మంగళగిరిలో అదృశ్యమైన యువతి.. కలకలం సృష్టిస్తున్న సెల్ఫీ వీడియో.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..!
Selfie
Follow us
Shiva Prajapati

|

Updated on: May 19, 2022 | 9:48 AM

Andhra Pradesh: ఓ యువతి పంపిన సెల్ఫీ వీడియో మంగళగిరిలో కలకలం సృష్టించింది. ఆ వీడియోతో అలర్ట్ అయిన పోలీసులు.. రెస్ట్ లేకుండా గాలింపు చేపట్టి చివరకు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఆ యువతి ఏం వీడియో పంపింది? అందులో ఏం చెప్పింది? పోలీసులు ఎందుకు అంత టెన్షన్ పడ్డారో ఇప్పుడు తెలుసుకుందాం..

గుంటూరు జిల్లా మంగళగిరిలో యువతి సెల్ఫీ వీడియో కలకలంరేపింది. పట్టణానికి చెందిన పల్లపు త్రివేణి అనే యువతి కనిపించకుండా పోయింది. కూతురు మిస్ కావడంతో తల్లిదండ్రులు టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో మోసం చేశారంటూ రాజాపై కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నిన్న మరోసారి రాజా వాళ్ళ ఇంటికి వెళ్ళిన త్రివేణి పై అసభ్యకరంగా మాట్లాడారు. దీంతో ఆమె ఇంటి నుండి వెళ్ళిపోయింది. కొద్దిసేపటికి తల్లిదండ్రులకు త్రివేణి సెల్ఫీ వీడియో పంపింది. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వీడియోలో ఆమె చెప్పారు. తన చావుకు ఏడుగురు కారణం అంటూ వీడియోలో ఆ పేర్లను చెప్పుకొచ్చింది. వారంతా తనను వేధించారంటూ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసింది. తనను బాగా హింసించారని.. తాను పడిన కష్టాలు ఏ అమ్మాయి పడకూడదన్నారు. తన దగ్గర డబ్బులు కూడా తీసుకుని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఏడుగురికి కఠిన శిక్ష పడాలని వీడియోలో కోరారు. ఈ వీడియో ఆధారంగా త్రివేణి ఎక్కడ ఉందో కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు. అలాగే వీడియోలో చెప్పిన పేర్లపై ఆరా తీస్తున్నారు. అయితే రాత్రి విజయవాడ గుణదల లో గుర్తించిన పోలీసులు ఆమె ను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!