కెనడాలో ఉద్యోగం చేస్తున్న తెలుగు యువకుడు ప్రమాదవ శాత్తు ఇతాకా జలపాతంలో పడిపోయి మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకెళ్తే.. కృష్ణా జిల్లా, శివారులోని పోరంకి చెందిన నెక్కలపు హరీష్ చౌదరి (35) కుటుంబంతోపాటు నివాసం ఉంటున్నాడు. హరీష్ ఎంటెక్ పూర్తిచేశాడు. అనంతరం పదేళ్ల క్రితం కెనడాకు వెళ్లి అక్కడ టూల్ డిజైనింగ్ జాబ్ చేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం సాయిసౌమ్యతో వివాహమైంది.
ఈ క్రమంలో బుధవారం (అక్టోబర్ 12) కుటుంబంతో సహా న్యూయార్క్‌లోని ఇతాకా జలపాతం సందర్శించడానికి వెళ్లాడు. ఫొటో దిగుతూ కాలు జారి ప్రమాదవశాత్తు జలపాతంలో పడిపోయాడు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. కొన్ని గంటల తర్వాత అతని మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించడంతో స్థానిక పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబానికి చేదోడుగా ఉన్న కొడుకు మృతి చెందడంతో స్వస్థలమైన పోరంకిలోనున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. హరీష్ మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.