Ashok Babu: ‘కుట్రలో భాగంగానే నాపై ఫిర్యాదు’.. సంచలన ఆరోపణలు చేసిన అశోక్ బాబు..

|

Jan 26, 2022 | 3:30 PM

Ashok Babu: తనపై సీఐడీ కేసు నమోదు అయినట్లు వస్తున్న కథనాలపై ఏపీ ఎన్జీవోల మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు..

Ashok Babu: ‘కుట్రలో భాగంగానే నాపై ఫిర్యాదు’.. సంచలన ఆరోపణలు చేసిన అశోక్ బాబు..
Follow us on

Ashok Babu: తనపై సీఐడీ(CID) కేసు నమోదు అయినట్లు వస్తున్న కథనాలపై ఏపీ ఎన్జీవోల(APNGO) మాజీ అధ్యక్షుడు, టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు(MLC Ashok Babu) స్పందించారు. తనపై సిఐడి కేసు నమోదు అయినట్టు కధనాలు వచ్చాయని, ఇది పాత సబ్జెక్ట్ అని పేర్కొన్నారు. చిన్న టైపో గ్రాఫిక్ మిస్టేక్ వల్ల నేరం కింద పరిగణించారని అన్నారు. తాను ఉద్యోగుల సంఘంలో ఉండగా తన ప్రత్యర్థులు చేసిన ప్రయత్నం ఇప్పుడు ఈ కేసు అనిక పేర్కొన్నారు. డి కామ్ అనేది బి కామ్ గా తప్పుగా టైప్ అయ్యిందని, దీన్ని అదునుగా తీసుకుని తన ప్రత్యర్థులు తనపై ఫిర్యాదు చేశారని చెప్పారు అశోక్ బాబు. దీనిపై డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీ కూడా జరిగిందన్నారు. 2019 లోనే స్పష్టంగా నేరపురితంగా గాని, ఎలాంటి బెనిఫిట్స్ గాని ఏమి లేవని టెక్నీకల్ మిస్టేక్ వలన జరిగిన దానికి పనిష్మెంట్ అవసరం లేదని విచారణాధికారి రిపోర్ట్ కూడా ఇచ్చారని అశోక్ బాబు వివరణ ఇచ్చారు. ఆర్గనైజేషన్‌లో వైరం, టీడీపీలో ఎమ్మెల్సీ కావడం ఇష్టం లేని వారు లోకాయుక్తకు ఓ ఉద్యోగితో ఫిర్యాదు చేయించారన్నారు. ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ ప్రోద్బలంతోనే ఇది జరిగిందని అశోక్ బాబు ఆరోపించారు.

రాజకీయంగా తనను దెబ్బ తీయడానికి కుట్ర చేస్తున్నారని అశోక్ బాబు అన్నారు. సూర్యనారాయణ ప్రభుత్వ మనిషి అని, ప్రభుత్వం అతన్ని హీరో చేసిందని అన్నారు. డిపార్ట్‌మెంట్ టెస్ట్ కూడా పాస్ కాలేని జీరో వ్యక్తిని హీరో చేసిందంటూ కామెంట్స్ చేశారు అశోక్ బాబు. తనపై వచ్చిన ఆరోపణలపై చట్టబద్ధంగా పోరడతానని స్పష్టం చేశారు అశోక్ బాబు. రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసు పెట్టారని అన్నారు. తాను ఏ విషయంలోనూ భయపడేది లేదని, సీబీఐ విచారణ కూడా చేసుకోవచ్చని అన్నారు. దీని గురించి ఉద్యోగులందరికీ తెలుసునని అన్నారు. ఉద్యోగ సంఘాల్లో పనిచేసినందుకే ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తోందని, ఇది సరి కాదన్నారు అశోక్ బాబు. ఉద్యోగుల ఆందోళనను పక్కదారి పట్టించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారని ఆరోపించారు. 2019 లోనే ఈ అంశం ముగిసిపోయిందని, దీనిపై ముందుగా లోకాయుక్త నోటీస్ ఇచ్చి సంజాయిషీ తీసుకోవాలన్నారు అశోక్ బాబు.

Also read:

Actor Sampath Raj: ఆ నటి నా మొదటి భార్య కాదు.. రూమర్స్ పై స్పందించిన నటుడు సంపత్ రాజ్..

Mudragada-Ap CM: కొత్త జిల్లాలకు వీరి పేర్లు పెట్టండి.. సీఎం జగన్‌కు ముద్రగడ లేఖ..

BIS Scientist Jobs: రూ.90,000ల జీతంతో బీఐ‌ఎస్‌లో 22 సైంటిస్ట్ ఉద్యోగాలు.. అర్హతలు, ఇతర వివరాలు..