Andhra pradesh: పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాలంటీర్లనూ తీసేస్తాం.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు

ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన కామెంట్లు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వాలంటీర్ వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్...

Andhra pradesh: పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాలంటీర్లనూ తీసేస్తాం.. మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు
Ambati Rambabu

Updated on: Jun 30, 2022 | 9:47 PM

ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా ఆయన చేసిన కామెంట్లు రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వాలంటీర్ వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పార్టీకి సమాచారం చేరవేసే సైనికులంటూ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నెల్లూరులో (Nellore) జరిగిన వైసీపీ జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశంలో ఆయన ఈ కామెంట్లు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే వాలంటీర్లనూ తీసేస్తామని వ్యాఖ్యానించడం గమనార్హం. వాలంటీర్లను సీఎం జగన్ మోహన్ (CM.Jagan) రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యేలు నియమించారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసేస్తామని, మళ్లీ కొత్త వాళ్లను నియమించుకుంటామని స్పష్టం చేశారు.

నిన్న (బుధవారం) కూడా మంత్రి అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండు సంవత్సరాలు కాదు కదా.. రెండు జన్మలెత్తినా చంద్రబాబు ముఖ్యమంత్రి కాలేరని షాకింగ్ కామెంట్స్ చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్లీనరి సమావేశం సందర్భంగా అంబటి రాంబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేసేందుకే ప్లీనరీలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. టీడీపీలో సంక్షేమ పథకాలు పొందాలంటే జన్మభూమి కమిటీలు చెప్పిన వారికే వచ్చాయని ఆరోపించారు. కానీ వైసీపీ పాలనలో కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..