AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Srikakulam: ప్రమాదాన్ని గ్రహించి.. అధికారుల దృష్టికి తీసుకు వెళ్దామనుకొని చివరకు ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు

అప్పటికే సమస్యను విద్యుత్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లామని అయినా వారు స్పందించలేదని స్థానికులు చెప్పడంతో.. తెగిపోయిన విద్యుత్ వైర్లను మొబైల్ లో వీడియో తీసి అధికారులకు పంపాలని భావించాడు. తన ఫోన్ లో వీడియో తీస్తుండగా తెగి వ్రేలాడుతున్న విద్యుత్ వైర్ పొరపాటున వసంత్ కుమార్ కి తాకింది.

Srikakulam: ప్రమాదాన్ని గ్రహించి.. అధికారుల దృష్టికి తీసుకు వెళ్దామనుకొని చివరకు ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
Janasena Karyakarta Vasanth
S Srinivasa Rao
| Edited By: Surya Kala|

Updated on: Jul 24, 2023 | 6:55 AM

Share

కళ్ళముందే విద్యుత్ వైరు తెగి వేలాడుతుంటే తనకెందుకులే అని అనుకోలేదు. ప్రమాదం గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెల్దామనుకున్నాడు. ఫోన్ లో వీడియో తీసి పంపిద్దామనుకున్నాడు. అయితే ఆక్రమంలో అదే విద్యుత్ వైర్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీకాకుళం జిల్లా పొందూరులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంకి ఓ యువకుడి నిండు ప్రాణాలు బలయ్యాయి. తెగిపోయిన విద్యుత్ తీగ తగిలి పొందూరు శ్రీశైన వీధికి చెందిన గొర్లె వసంత కుమార్ అనే యువకుడు మృతిచెందాడు. వసంత కుమార్ పొందూరు పట్టణంలో క్రియా శీల జనసేన కార్యకర్తగా ఉన్నాడు. పట్టణ పరిధిలో ప్రజా సమస్యల పట్ల వెంటనే స్పందిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆదివారం రోడ్డు పక్కన విద్యుత్ తీగ లు తెగిపోయి వెలాడుతూ కనిపించాయి.

అయితే అప్పటికే సమస్యను విద్యుత్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లామని అయినా వారు స్పందించలేదని స్థానికులు చెప్పడంతో.. తెగిపోయిన విద్యుత్ వైర్లను మొబైల్ లో వీడియో తీసి అధికారులకు పంపాలని భావించాడు. తన ఫోన్ లో వీడియో తీస్తుండగా తెగి వ్రేలాడుతున్న విద్యుత్ వైర్ పొరపాటున వసంత్ కుమార్ కి తాకింది. దాంతో తీవ్రంగా వసంత్ గాయపడగా.. వెంటనే అతడిని చికిత్స కోసం పొందూరు హాస్పిటల్ కి తరలించారు. విద్యుత్ షాక్ లో తీవ్ర గాయాలు కావడంతో వసంత్ కుమార్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూనే మృతి చెందాడు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెల్లాలని భావించి చివరకు మృత్యువాత పడటం అందరిని కలిచి వేసింది.

వసంత్ కుమార్ మృతి చెందినట్లు తెలిసి ఆమదాలవలస నియోజకవర్గ జనసేన ఇంచార్జి పేడాడ రామోహన్ రావుతో పాటు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఎలక్ట్రికల్ ఏ ఈ తో పాటు, లైన్ మన్ లను నిలదీశారు. విద్యాశాఖ నిర్లక్ష్యం వల్లే వసంత కుమార్ చనిపోయాడని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ శాఖ చర్యలు తీసుకోవాలని ధర్నా చేపట్టారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..