Global Investors Summit: నవ భారత నిర్మాణంలో ఏపీదే కీలక పాత్ర: రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ..

|

Mar 03, 2023 | 1:42 PM

Andhra Pradesh: సమ్మిట్‌లో భాగస్వామ్మనైందుకు సంతోషంగా ఉందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. నేడు వైజాగ్‌లో మొదలైన జీఐఎస్‌-2023కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ హాజరయ్యారు.

Global Investors Summit: నవ భారత నిర్మాణంలో ఏపీదే కీలక పాత్ర: రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీ..
Mukesh Ambani Speech Gis 2023
Follow us on

సమ్మిట్‌లో భాగస్వామ్మనైందుకు సంతోషంగా ఉందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ పేర్కొన్నారు. నేడు వైజాగ్‌లో మొదలైన జీఐఎస్‌-2023కు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులే లక్ష్యంగా జగన్‌ ప్రభుత్వం గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సమ్మిట్‌లో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. పలు రంగాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారుతున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయని, పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే వచ్చారని ఉద్ఘాటించారు.

నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతుందని ముఖేష్‌ అంబానీ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5జీ నెట్‌వర్క్‌ 90శాతం కవర్‌ చేస్తున్నట్లు, ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..