Inter Students Missing at RK beach: విశాఖ ఆర్కే బీచ్‌లో విషాదం.. ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతు!

విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌ వద్ద విషాదం చోటుచేసుకుంది. ఎన్నారై కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతోన్న ఇద్దరు ఇంటర్‌ విద్యార్ధులు ఆర్కే బీచ్‌లో ఈతకు వెళ్లిన సముద్రంలో గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్ధుల్లో హర్ష అనే యువకుడి మృతదేహం సముద్రం ఒడ్డున లభ్యమైంది. మరో యువకుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన గురువారం (అక్టోబర్ 19) ఉదయం..

Inter Students Missing at RK beach: విశాఖ ఆర్కే బీచ్‌లో విషాదం.. ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు గల్లంతు!
Inter Students Missing at RK beach

Edited By:

Updated on: Oct 19, 2023 | 9:27 PM

విశాఖపట్నం, అక్టోబర్‌ 19: విశాఖ బీచ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. కవ్వించే కెరటాలకు ఆకర్షతులై.. సరదాగా బీచ్కు విహారానికి వెళ్లిన ఏడుగురు యువకుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. ఒకరు కొనఊపిరితో ఒడ్డుకు వచ్చినప్పటికీ ప్రాణాలు నిలవలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గల్లంతయిన మరొకడు కోసం గాలిస్తూ ఉన్నారు.

జాగింగ్ కోసమని బయలుదేరి..

రాహుల్ కుమార్, హర్ష ఇద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇద్దరు ఒకే కాలేజ్ కావడంతో స్నేహితులు. వాళ్లతో పాటు రాకేష్, హరీష్, శశికిరణ్, చైతన్య, సంజయ్ జత కలిశారు. వారిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ లో ఉన్నారు. నేవీ సెలక్షన్ కోసమని జాగింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా కొంతమంది జాగింగ్ కోసమని ఇంటి నుంచి బయలుదేరారు. ఏడుగురు యువకులు ఆర్కే బీచ్ లో కలిశారు. కాసేపు జాగింగ్ చేసి ఆ తర్వాత బీచ్ లోకి వెళ్లారు. అక్కడ సముద్ర స్థానానికి దిగారు. ఒడ్డున ఐదుగురు మరో ఇద్దరు కాస్త లోపలికి వెళ్లారు. వీరిలో హర్ష, రాహుల్ కుమార్ ను కెరటాలు లోపలికి లాక్కెళ్ళిపోయాయి.

క్షణాల్లోనే కళ్ళముందే జరిగిపోయింది.. ఒడ్డుకు వచ్చినా..

కళ్ళముందే ఇద్దరూ కొట్టుకుపోతున్న ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు సహచరులు. కాసేపటికి స్థానికుల సహకారంతో హర్షను ఒడ్డుకు చేర్చారు. కొనఊపిరితో ఉన్న హర్షను హుటాహుటిన కేజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హర్ష ప్రణాలు కోల్పోయాడు. గల్లంతయిన మరో యువకుడు రాహుల్ కుమార్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. ఘటన కలరా చూసిన స్నేహితుడు తీవ్ర ఆవేదన చెందుతూ తల్లడిపోతున్నాడు.

ఇవి కూడా చదవండి

కన్నీరు మున్నీరవుతున్న రాహుల్ కుమార్ పేరెంట్స్..

హర్ష మృతి తో పాటు రాహుల్ కుమార్ గలంతుతో ఆయా కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. రాహుల్ కుమార్ కోసం బీచ్కు చేరుకున్న పేరెంట్స్ కన్నీరు మున్నిరై విలపిస్తున్నారు. చేతికి అంది వచ్చిన కొడుకు ఇలా కెరటాల్లో కొట్టుకుపోవడంతో ఆ తల్లి తల్లడిల్లి పోతోంది. ఆ దృశ్యాలు అందరినీ కలిసి వేస్తున్నాయి. అమ్మ జాగింగ్ కి వెళ్ళొస్తానమ్మ అని చెప్పి.. ఇలా కెరటాల్లో నా కొడుకు కొట్టుకుపోయాడు. అంటూ రోధిస్తున్న తీరు అందరినీ కలచి వేస్తోంది.

ముమ్మరంగా గాలింపు చర్యలు..

ఆర్కే బీచ్ లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్ళు సముద్రం కు వెళ్లి ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసుల పర్యవేక్షిస్తున్నారు. నేవీ అధికారులతో మాట్లాడి హెలికాప్టర్లను రంగంలోకి దింపేందుకు యోచిస్తున్నారు పోలీసులు. ఆర్కే బీచ్ లో పర్యాటకులు సందర్శకులు పర్యవేక్షణ పెరగాలని కోరుతున్నారు స్థానికులు. మరోవైపు ఎంత హెచ్చరిస్తున్నా యువకులు వినకుండా కెరటాలోకి వెళ్లడం వల్లే ప్రాణాల పైకి వస్తుందని అంటున్నారు పోలీసులు, గజ ఈతగాళ్లు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.