విద్యార్థులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,03,990 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొదటి సంవత్సరం ఎగ్జామ్స్ 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, సెకండియర్‌లో 5.19 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందుకోసం 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 15న ప్రారంభమై.. ఏప్రిల్ 4న ముగిశాయి. 22 రోజుల వ్యవధిలో ఫలితాలను ప్రకటించబోతోంది ఇంటర్ బోర్డు. ఈ మధ్య కాలంలో ఒకేసారి ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి.
ఇంటర్మీడియట్ ఫలితాలు ప్రభుత్వ అధికారిక సైట్‌తో పాటు.. Tv9telugu.com లో కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు తమ ఫలితాలను ఇక్కడ కూడా చూసుకోవచ్చు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..