Andhra Pradesh: చనిపోయేముందు భర్తతో ప్రేమగా మాట్లాడి సూసైడ్‌.. ఆ మరుసటి రోజే భర్త కూడా..! ఏం జరిగిందో..

|

Aug 09, 2023 | 9:50 AM

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన బాలపుల్లయ్య, ఓబుళమ్మ దంపతులు కుమారుడు మంజునాథ్‌కు (27). పుట్లూరు మండలం గరుగుచింతలపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు, లక్ష్మీదేవిల కుమార్తె రమాదేవి (24). మంజునాథ్‌, రమాదేశి ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా పట్టుబట్టి ఓప్పించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కొత్త కాపురం పెట్టిన ఈ జంట సంతోషంగానే..

Andhra Pradesh: చనిపోయేముందు భర్తతో ప్రేమగా మాట్లాడి సూసైడ్‌.. ఆ మరుసటి రోజే భర్త కూడా..! ఏం జరిగిందో..
Manjunath, Ramadevi
Follow us on

తాడిపత్రి, ఆగస్టు 9: ఒకరిపై ఒకరు మనసుపడ్డారు. నిండు నూరేళ్లు కలిసి జీవించాలని కలలు గన్నారు. ఇరువురి ఇళ్లల్లో పెళ్లికి అంగీకరించకపోయినా పట్టుబట్టి మరీ ఒప్పించారు. చివరికి అంగరంగ వైభవంగా వివాహం కూడా చేసుకున్నారు. ఆరు నెలలపాటు కాపురం తర్వాత ఏం జరిగిందో తెలియదు.. ఏ కష్టం వచ్చిందో తెలియదుగానీ ఇరువురూ ఒకరి తర్వాత ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. మొదట భార్య ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలిసిన భర్త కూడా మరుసటి రోజు రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇరుకుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామానికి చెందిన బాలపుల్లయ్య, ఓబుళమ్మ దంపతులు కుమారుడు మంజునాథ్‌కు (27). పుట్లూరు మండలం గరుగుచింతలపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు, లక్ష్మీదేవిల కుమార్తె రమాదేవి (24). మంజునాథ్‌, రమాదేవి ప్రేమించుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించకపోయినా పట్టుబట్టి ఓప్పించారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. కొత్త కాపురం పెట్టిన ఈ జంట సంతోషంగానే ఉండేవారు. మంజునాథ్‌ ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు.

ఎంతో అన్యోన్యంగా ఈ జంట ఉండేది. ఐతే ఏం జరిగిందో తెలియదు సోమవారం (ఆగస్టు 7) సాయంత్రం పట్టణంలోని చల్లవారిపల్లి గ్రామ సమీపంలో రైలు కిందపడి రమాదేవి మృతి చెందింది. ఆత్మహత్యకు ముందు భర్తతో ప్రేమగా మట్లాడి ఈ దారుణానికి పాల్పడింది. అల్లుడు మంజునాథ్‌ కుటుంబం వరకట్న వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని రమాదేవి తల్లిదండ్రులు జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య రమాదేవి మరణించిందన్న వార్త విన్న సోమవారం రాత్రి రెండుసార్లు రైలు కిందపడేందుకు మంజునాథ్‌ కూడా వెళ్లాడు. ఐతే కుటుంబ సభ్యులు అడ్డుపడి ఎలాగో ఇంటికి తీసుకొచ్చారు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అందరూ నిద్రలో ఉండగా మంజునాథ్‌ ఇంటి నుంచి బయటికి వచ్చాడు. ఆ తర్వాత తాడిపత్రి రైల్వేస్టేషన్‌ సమీపంలోకి వచ్చి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

దంపతులు ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడటంతో ఇరువురి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో చిన్నపొలమడ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. జంట ఆత్మహత్యలకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.