Andhra Pradesh: జీవో1పై కీలక పరిణామం.. సస్పెన్షన్ కొనసాగించేందుకు కోర్టు నిరాకరణ..

|

Jan 23, 2023 | 6:20 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోపై విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించేందుకు..

Andhra Pradesh: జీవో1పై కీలక పరిణామం.. సస్పెన్షన్ కొనసాగించేందుకు కోర్టు నిరాకరణ..
Andhra Pradesh High Court
Follow us on

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 పై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన ఈ జీవోపై విధించిన సస్పెన్షన్‌ను కొనసాగించేందుకు హైకోర్టు నిరాకరించింది. జీవో నెంబర్ 1 పై సోమవారం నాడు కోర్టు వాదనలు జరుగగా.. ధర్మాసనం తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే, ఈ జీవోపై వేసిన మిగిలిన పిటిషన్లు అన్నింటిపై మంగళవారం నాడు విచారణ జరుపనుంది హైకోర్టు. రేపు వాదనలు విన్న తరువాత తుది తీర్పు వెలువరించనుంది ధర్మాసనం.

రోడ్లపై సభలను నిషేధిస్తూ జీవో నెంబర్ 1..

రోడ్లపై సభలను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 1‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ పలువురు కోర్టుని ఆశ్రయించారు. దీంతో 23 వరకు జీవోను సస్పెండ్ చేసింది న్యాయస్థానం. ఇవాళ (సోమవారం) మరోసారి వాదనలు జరిగాయి. అయితే జీవో సస్పెన్షన్‌పై నేటితో గడువు ముగస్తున్నందున.. మళ్లీ పొడగించాలంటూ పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది.

రోడ్లన్నీ పూర్తిగా బాగు చేయాలి..: సీఎం

అదలాఉంటే.. ఆర్‌ అండ్‌ బి శాఖపై సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం జగన్. ఉన్న రోడ్లను పూర్తిగా బాగు చేయడంతోపాటు.. కొత్తగా వేస్తున్న రోడ్లను నాణ్యతతో వేయాలని ఆదేశించారు. రోడ్డు వేశాక కనీసం ఏడేళ్లపాటు పాడవ్వకుండా చూడాలని చెప్పారు. నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ప్రధానమైన రోడ్లన్నింటినీ పూర్తిచేయాలని చెప్పారు సీఎం. వచ్చే జూన్, జులై లోపు నిర్దేశించుకున్న మేరకు రోడ్లు వేయాలని స్పష్టం చేశారు. ఇంత ఖర్చుచేసి రోడ్లు బాగుచేస్తున్నా కొందరు నెగిటివ్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాళ్ల కడుపుమంటకు మందులేదని.. అందుకే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచాలని సూచించారు ముఖ్యమంత్రి జగన్. ఆయా ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లలో వివరాలు ఉంచాలని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..