సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.. కలకలం రేపుతోన్న సూసైడ్ నోట్

లక్ష్యాలు సాధించాల్సిందేనంటూ ఉన్నతాధికారులు పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ లెటర్‌ రాశాడు. దానిని వాట్సప్‌లో పోస్టు చేసిన అనంతరం నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు ఉరి పెట్టుకున్నాడు. జగనన్న భూహక్కు - భూరక్ష కార్యక్రమంలో భాగంగా సచివాలయ ఉద్యోగి పని ఒత్తిడి తట్టుకోలేక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం (సెప్టెంబర్‌ 26) ఈ ఘటన..

సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం.. కలకలం రేపుతోన్న సూసైడ్ నోట్
Grama Ward Sachivalayam Employee Suicide Attempt

Updated on: Sep 27, 2023 | 9:15 AM

రంపచోడవరం, సెప్టెంబర్‌ 27: లక్ష్యాలు సాధించాల్సిందేనంటూ ఉన్నతాధికారులు పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్‌ లెటర్‌ రాశాడు. దానిని వాట్సప్‌లో పోస్టు చేసిన అనంతరం నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు ఉరి పెట్టుకున్నాడు. జగనన్న భూహక్కు – భూరక్ష కార్యక్రమంలో భాగంగా సచివాలయ ఉద్యోగి పని ఒత్తిడి తట్టుకోలేక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో మంగళవారం (సెప్టెంబర్‌ 26) ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామ సర్వేయర్లు తెలిపిన వివరాల ప్రకారం..

రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలోని సచివాలయ ఉద్యోగి సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దేవీపట్నం మండలం ఇందుకూరుకు చెందిన నాగార్జున గంగవరం మండలం జగ్గంపాలెం సచివాలయంలో బాధితుడు గ్రామ సర్వేయర్‌గా పని చేస్తున్నాడు. భూహక్కు – భూరక్ష కార్యక్రమంలో భాగంగా వేగంగా సర్వే పనులు పూర్తి చేయాలని ఉన్నతాధికారులు నిత్యం ఒత్తిడి చేయసాగారు. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని బాధితుడు ఐటీడీఏ ప్రాజెక్ట్‌ అధికారికి తెలిపారు. అయినప్పటికీ ఎస్‌ఆర్‌ తీసుకుని తక్షణమే తనవద్దకు రావాలని అధికారి ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఐటీడీఏకి వెళ్లి మండల సర్వేయర్‌కు ఎస్‌ఆర్‌ ఇచ్చి వెళ్లిపోవాలని పీఓ సీసీ ఆదేశించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధిత ఉద్యోగి తాను అధికారుల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేపర్‌పై రాసి దానిని ఫొటో తీసి మంగళవారం సర్వేయర్ల వాట్సప్‌ గ్రూపులో పోస్టు చేశాడు.

దీంతో ఈ విషయం తెలుసుకున్న తోటి సర్వేయర్లు వెంటనే జగ్గంపాలెం వెళ్లి గాలించగా పెట్రోల్‌ బంక్‌ వద్ద అటవీ ప్రాంతంలో సదరు వ్యక్తి కిందపడి ఉన్నట్టు గుర్తించారు. చెట్టుకు ఉరి వేసుకోవడానికి యత్నించగా తాడు తెగిపోయి కింద పడిపోయాడు. దీంతో బాధితుడు బ్లేడుతో చెయ్యి కోసుకున్నాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న బాధితుడిని సర్వేయర్లు సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయనను తూర్పుగోదావరి జిల్లా గోకవరం సామాజిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.