Ganesh Nimajjanam: గణపతి బప్పా మోరియా.. గణేష్ నిమజ్జనోత్సవంలో డాన్స్‌తో ఇరగదీసిన కుక్క..
గణేషుడి సేవలో భక్త జనం తరించిపోతున్నారు. భక్తికి మనుషులు, పక్షులు, జంతువులు అనే తేడా ఉండదు. అంతా ఆ ఏకదంతుడి ప్రసన్నం కోసం ఏదో ఒకటి చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో గణేష్ నిమ్మజ్జనాలు మొదలయ్యాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా డీజే సౌండ్‌లో స్టెప్పులు దూమ్మురేపుతున్నారు. నగరంలోని పాత బస్టాండ్ వద్ద గణేష్ నిమజ్జనోత్సవాల్లో ఓ కుక్క చిందేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.

మన్యం జిల్లా, సెప్టెంబర్ 27: ఈరోజుల్లో కుక్కను సైతం ఉస్కో.. అంటే డిస్కో.. అంటోంది. అనటమే కాదు.. తదనైన స్టైల్ చూపెడుతుంది. ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం.. ఇప్పుడు గణేష్ నవరాత్రులు కొనసాగుతున్నాయి. గణేషుడి సేవలో భక్త జనం తరించిపోతున్నారు. భక్తికి మనుషులు, పక్షులు, జంతువులు అనే తేడా ఉండదు. అంతా ఆ ఏకదంతుడి ప్రసన్నం కోసం ఏదో ఒకటి చేస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో గణేష్ నిమ్మజ్జనాలు మొదలయ్యాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా డీజే సౌండ్‌లో స్టెప్పులు దూమ్మురేపుతున్నారు. నగరంలోని పాత బస్టాండ్ వద్ద గణేష్ నిమజ్జనోత్సవాల్లో ఓ కుక్క చిందేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది.
పాలకొండ పట్టణంలోని సెగిడి వీధిలో ఏర్పాటుచేసిన వినాయక విగ్రహాన్ని ఆదివారం సాయంత్రం ఊరేగింపుగా నిమజ్జనానికి తీసుకు వెళ్ళారు స్థానికులు. ఉర్రూతలూగించే డీజే సౌండ్స్‌తో యువత డాన్స్‌లతో ఊరేగింపు ముందుకు వెళుతుండగా.. పాత బస్టాండ్ వద్దకు ఊరేగింపు వచ్చేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో గాని వీధి శునకం ఒకటి ఊరేగింపులోకి చేరింది. డాన్సు చేస్తున్న యువత వద్దకు సమీపించింది.
అంతే తనకు మూడ్ వచ్చినట్టుంది యువతతో కలిసి అడుగులో అడుగేస్తే స్టెప్పులు వేసింది. డీజే సౌండ్స్‌కి తగ్గట్టు లయబద్దంగా బాడీ నీ ఊపుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కుక్క డాన్స్ చేయటాన్ని చూసిన స్థానికులు మొదట షాక్ అయ్యారు. తరువాత తేరుకొని కుక్కకు మెడలో దండ వేసి దానితో కలిసి చిన్నారులు, యువత కాసేపు డాన్సులు చేశారు. కుక్క డాన్స్ చేయటాన్ని కొందరు తమ మొబైల్ ఫోన్ కెమెరాలలో బంధించారు. ఇపుడు ఈ కుక్క డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణoగా కుక్కని విశ్వాసానికి ప్రతీకగా చూస్తారు. కొన్ని పెంపుడు కుక్కలయితే యజమాని కుటుంబ సభ్యులతో తమ ఫీలింగ్స్ ను మనుషులు లాగే వ్యక్త పరచటం,చిన్నారుల పట్ల పెద్దవారిలాగా కేర్ తీసుకోవటం వంటివి చేస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. అంతేకాదు దొంగలను, ఉగ్రవాదులు అమర్చిన బాoబులను పసికట్టడంలోను శునకాలు కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి.
అయితే తాజాగా పాలకొండ గణేష్ నిమజ్జనోత్సవాలలో శునకం అది కూడా ఎటువంటి శిక్షణ లేని ఓ వీధి కుక్క డాన్స్ చేయటం అంతటా పెద్ద చర్చనీయాంశంగా మారింది. కొందరు కలికాలం ప్రభావం అంటూ ఉంటే .. మరికొందరైతే కుక్కల మేదా శక్తి గొప్పదని అవి ఎందులోనూ తీసిపోవని మాట్లాడుకుంటున్నారు.
ఆ వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
