రాజమండ్రి రోడ్ కం రైల్ బ్రిడ్జ్‌పై వెళ్తున్నారా.? ఇది మీ కోసమే..
కొవ్వూరు-రాజమహేంద్రవరం మధ్య గోదావరిపై ఉన్న రోడ్డు కం రైలు బ్రిడ్జి మూసేయనున్నారు అధికారులు. మరమ్మత్తుల కారణంగా ఈ రోజు నుంచి నెల రోజులు వంతెనపై వాహన రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు.
కొవ్వూరు-రాజమహేంద్రవరం మధ్య గోదావరిపై ఉన్న రోడ్డు కం రైలు బ్రిడ్జి మూసేయనున్నారు అధికారులు. మరమ్మత్తుల కారణంగా ఈ రోజు నుంచి నెల రోజులు వంతెనపై వాహన రాకపోకలను పూర్తిగా నిలుపుదల చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 27వ తేదీ అంటే ఈరోజు నుంచి అక్టోబర్ 26వ తేదీ వరకు వాహనాలను అనుమతించారు. అటు కాలిబాట వారైనాసరే ఇక్కడ నుంచి వెళ్లేందుకు అనుమతి లేదు. 2 కోట్ల10లక్షల రూపాయలతో వంతెనపై దెబ్బతిన్న రహదారి, సెకండరీ జాయింట్స్, విద్యుత్ పనులను చేపడుతున్నారు. ఇటు రాజమహేంద్రవరం, అటు ఏలూరు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు, తాడేపల్లిగూడెం వైపుల నుంచి వాహనాలను గామన్ బ్రిడ్జి మీదుగా మళ్లించనున్నారు.
కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం చేరుకోవాలంటే రోడ్డు కం రైలు బ్రిడ్జి మీదుగా కేవలం 5 కి.మీ. అదే గామన్‌బ్రిడ్జి, విజ్జేశ్వరం బ్యారేజ్‌ల మీదుగా చేరుకోవాలంటే సుమారు 20 మేర ప్రయాణించాల్సిందే. ప్రస్తుతం విజ్జేశ్వరం బ్యారేజ్ రోడ్ మరమ్మతులకు గురైంది. గామన్‌బ్రిడ్జి మీదుగా ప్రయాణించాలంటే సామాన్య ప్రజానీకానికి వ్యయ ప్రయాసలు తప్పవు. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టకుండా బ్రిడ్జిని మూసేశారని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. పేద,మధ్య తరగతి ప్రజలు, ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల సౌకర్యా ర్థం రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖతో సంప్రదించి కనీసం రెండు కంపార్ట్‌మెంట్లతో రాజమహేంద్రవరం, కొవ్వూరుల మధ్య షటిల్ సర్వీస్‌ను, గోదావరి నదిలో లాంచీల సౌకర్యాన్ని ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం..