Rythu Bharosa: రైతన్నలూ అలర్ట్.. నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు.. బటన్ నొక్కి ప్రారంభించనున్న సీఎం..

|

Jan 03, 2022 | 8:40 AM

Rythu Bharosa: నేడు వైఎస్సార్‌ రైతు భరోసా - పీఎం కిసాన్‌ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.

Rythu Bharosa: రైతన్నలూ అలర్ట్.. నేరుగా వారి ఖాతాల్లోకి డబ్బులు.. బటన్ నొక్కి ప్రారంభించనున్న సీఎం..
Follow us on

Rythu Bharosa: నేడు వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50.58 లక్షల మంది రైతులకు రూ. 1,036 కోట్ల రైతు భరోసా సాయం అందించనున్నారు. రైతు భరోసా క్రింది పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా 13,500 రైతు భరోసా సాయం అందిస్తోంది ప్రభుత్వం. ఇప్పుడు అందిస్తున్న రూ. 1,036 కోట్లతో కలిపి ప్రభుత్వం ఇప్పటివరకు రైతులకు అందించిన మొత్తంలో వైఎస్సార్‌ రైతు భరోసా సాయం మాత్రమే రూ. 19,813 కోట్లు. వైసీపీ ఎన్నికల హామీలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ. 13,500 సాయం విడతల వారీగా అందిస్తోంది. ఇందులో మొదటి విడతగా ఖరీఫ్‌ పంట వేసే ముందు అంటే మే నెలలో రూ. 7,500, రెండవ విడతగా అక్టోబర్‌ నెల ముగిసేలోపే ఖరీఫ్‌ పంట కోత సమయం, రబీ అవసరాల కోసం రూ. 4,000, మూడవ విడతగా ధాన్యం ఇంటికి చేరే సంక్రాంతి వేళ జనవరి నెలలో రూ. 2,000 చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తోంది.

Also read:

Africa Parliament: పార్లమెంట్లలో భారీ అగ్ని ప్రమాదం.. కీలక డాక్యూమెంట్లు దగ్ధం.. అసలేం జరుగుతోంది..!

Uttar Pradesh Elections 2022: యూపీలో ఎన్నికల హోరు.. కీలక ప్రకటన చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్..

Ragging: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. విద్యార్థి బట్టలు విప్పించి, ట్రిమ్మర్‌తో..