Electric Bikes: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కారు బంపరాఫర్‌.. లక్షకుపైగా ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ కొనుగోలు..

AP Government Electric Bikes: ఆంధ్రప్రదేశ్‌ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం బంపరాఫర్‌ అందిస్తోంది. తక్కువ ధరకు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసుకునేందుకు చేయూతనివ్వనుంది. ఆకర్షణీయ ధరలకు దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్థల..

Electric Bikes: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కారు బంపరాఫర్‌.. లక్షకుపైగా ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్‌ కొనుగోలు..
Ap Government Electric Bike
Follow us

|

Updated on: Mar 30, 2021 | 7:42 PM

AP Government Electric Bikes: ఆంధ్రప్రదేశ్‌ సర్కారు ప్రభుత్వ ఉద్యోగుల కోసం బంపరాఫర్‌ అందిస్తోంది. తక్కువ ధరకు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసుకునేందుకు చేయూతనివ్వనుంది. ఆకర్షణీయ ధరలకు దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్‌ సంస్థల నుంచి ఈ ఎలక్ట్రిక్‌ బైక్‌లను కొనుగోలు చేసుకునేందుకు అవకాశం కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఈ విషయమై ఇప్పటికే తక్కువ వడ్డీ రేటు అందించేందుకు గాను వాహనాల సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో సంప్రదింపులు మొదలుపెట్టింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎనర్జీ ఎఫిషియోన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్ఎల్‌)తో ఏపీ స‌ర్కార్ కలిసి పనిచేయనుంది. ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ప్రభుత్వ ఉద్యోగులకు అందించనున్నారు. అంతేకాకుండా తక్కు వడ్డీకే లోన్‌లు ఇప్పించేందుకు గాను బ్యాంకులతో పాటు.. కేఎఫ్‌డ‌బ్ల్యూ, జీఐజ‌డ్ వంటి గ్లోబ‌ల్ సంస్థలతోనూ చర్చిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అంపేర్‌, ఒకినావా వంటి విద్యుత్‌ ఆధారిత వాహనాల తయారీ సంస్థలు వాహనాలు సరఫరా చేయడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. ఏప్రిల్‌ 10లోపు బిడ్లు దాఖలవుతాయని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ఈఈఎస్‌ఎల్‌తో పాటు ధర్మల్‌ విద్యుత్‌ సంస్థ ఎన్టీపీసీ ఆర్థిక పరంగా చేయూతనివ్వడానికి ముందుకు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ నూత‌న‌, సంప్రదాయేత‌ర‌ ఇంధ‌న అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ ర‌మ‌ణారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరుగుతందని భావిస్తున్నారు. ఇక అధికారులు ఇప్పటి నుంచే ప్రభుత్వ ఉద్యోగుల‌కు ఈ ఎలక్ట్రిక్‌ టూ వీల‌ర్స్ స‌ర‌ఫ‌రా చేయ‌డానికి, వాహ‌నాల స‌ర్వీసింగ్ కోసం 13 జిల్లాల్లోని 650 మండ‌లాలు, 100 మునిసిపాలిటీల్లో వ‌స‌తుల ఏర్పాట్లపై దృష్టి సారించారు.

Also Read: Kodali Nani : ఎన్టీఆర్ ఆశయాలను, సిద్ధాంతాలను తుంగలో తొక్కి..పగటి వేషగాళ్ల డ్రామాలు : కొడాలి నాని వీడియో…

మయన్మార్ సరిహద్దుల్లో టీటీడీ తలనీలాలు కలకలం.. పట్టుబడిన జుట్టుపై వివరణ ఇచ్చిన అధికారులు

Car Coated With Cow Dung: వాట్‌ ఏ ఐడియా..! దంచికొడుతోన్న ఎండల నుంచి తన కారును ఎలా కాపాడుకుంటున్నాడో చూడండి..

Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..
ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..