Andhra Pradesh: వినియోగదారులకు గుడ్ న్యూస్.. అక్కడ తక్కువ ధరకే టమాటా విక్రయాలు..

వంటింట్లో టమాటా(Tomato) మంట పెడుతోంది. ప్రతి వంటలో నిత్యావసరమైన టమాటా ధర విపరీతంగా పెరిగింది. బహిరంగ మార్కెట్లలో కేజీ టమాటా రూ.80 పలుకుతోంది. అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న వీటి ధరలకు....

Andhra Pradesh: వినియోగదారులకు గుడ్ న్యూస్.. అక్కడ తక్కువ ధరకే టమాటా విక్రయాలు..
Tomato
Follow us
Ganesh Mudavath

|

Updated on: May 20, 2022 | 9:10 AM

వంటింట్లో టమాటా(Tomato) మంట పెడుతోంది. ప్రతి వంటలో నిత్యావసరమైన టమాటా ధర విపరీతంగా పెరిగింది. బహిరంగ మార్కెట్లలో కేజీ టమాటా రూ.80 పలుకుతోంది. అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న వీటి ధరలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్కెటింగ్‌ శాఖ ద్వారా రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి శుక్రవారం నుంచి రైతుబజార్ల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లుచేసింది. హైదరాబాద్‌(Hyderabad) తదితర ప్రాంతాల నుంచి దిగుమతులు తగ్గడం, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండడం ధరల పెరుగుదలకు కారణమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. బహిరంగ మార్కెట్‌ ధరలతో పోలిస్తే రైతు బజార్లతో ధర కిలోకు కనీసం రూ.10 తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ(Telangana)తో పాటు ఇతర ప్రాంతాల నుంచి మరో 40 టన్నుల దిగుమతికి ఏర్పాట్లుచేసింది. వీటిని ఉత్తరాంధ్రతో పాటు కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో రైతుబజార్ల ద్వారా విక్రయించనుంది. కిలో రూ.60కు మించకుండా అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టారు.

మదనపల్లి వంటి టమాటా మార్కెట్లలో నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టింది. తద్వారా నాలుగైదు రోజుల్లో వీటి ధరలను పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చని అధికారులు వెల్లడించారు. బహిరంగ మార్కెట్లలో టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే స్వయంగా పక్క రాష్ట్రాల నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటోందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. సాధ్యమైనంత త్వరగా ధరలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

టమాటో ధర మళ్లీ కొండెక్కింది. కర్నూలు మార్కెట్‌లో 80 రూపాయల ధర పలికింది. రైతు బజార్‌లో 70 రూపాయలుండగా బయటి మార్కెట్‌లో పది రూపాయలు ఎక్కువగా ఉంది. ధరలు మండిపోతుండటంతో కొనేదెట్టా అని వినియోగదారులు నిట్టూరుస్తున్నారు. కూరగాయాలతో పాటు టమాటా కూడా సామాన్యుడికి అందనంత ఎత్తులో కూర్చుంది. కేవలం పదంటే పది రోజుల వ్యవధిలో ఏకంగా కిలో టమాటా 50 రూపాయల వరకు పెరిగింది. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కన్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Omicron Variant BA.4: భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.4 అలజడి.. హైదరాబాద్‌లో తొలి కేసు నమోదు..

Kamal Haasan’s Vikram: కమల్ హాసన్ సినిమాకోసం రంగంలోకి దిగిన టాలీవుడ్ కుర్రహీరో హోమ్ బ్యానర్..