Hyderabad: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ(IMD) వెల్లడించింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి. మరో వారం....
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ(IMD) వెల్లడించింది. ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులకు చేరుకున్న నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలో చురుగ్గా కదులుతున్నాయి. మరో వారం రోజుల్లో కేరళ(Kerala) ను తాకే అవకాశం ఉందని తెలిపింది. ఈ సారి ముందుగానే రుతుపవనాలు రానున్నాయన్న ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 5 నుంచి జూన్ 10లోపు తెలంగాణలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ, మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించే అనుకూల వాతావరణం కనిపిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో రాగల రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వెల్లడించింది.
తెలంగాణలో ఈ నెల 21వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం పలు జిల్లాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పలు ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వెల్లడించింది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Happy Birthday Jr NTR: తారకరామ ఏంటి ఇది..? NTR పుట్టినరోజున ఫ్యాన్స్ కి చేదు జ్ఞాపకం..
Satyadev’s Godse: సత్యదేవ్ గాడ్సే విడుదలకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..