Kamal Haasan’s Vikram: కమల్ హాసన్ సినిమాకోసం రంగంలోకి దిగిన టాలీవుడ్ కుర్రహీరో హోమ్ బ్యానర్..

యూనివర్సల్ హీరో కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'విక్రమ్'.

Kamal Haasan's Vikram: కమల్ హాసన్ సినిమాకోసం రంగంలోకి దిగిన టాలీవుడ్ కుర్రహీరో హోమ్ బ్యానర్..
Kamal Haasan Vikram
Follow us
Rajeev Rayala

|

Updated on: May 20, 2022 | 6:36 AM

యూనివర్సల్ హీరో కమల్ హాసన్(Kamal Haasan), సక్సెస్ ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘విక్రమ్’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా నటించడమే కాకుండా, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై ఆర్ మహేంద్రన్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ పవర్ ఫుల్ పాత్రలలో కనిపించనుండగా హీరో సూర్య అతిధి పాత్రలో అలరించనున్నారు. అప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఇదిలా ఉంటే ఈ సినిమా తమిళ్ , తెలుగు భాషల్లో విడుదల కానున్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ వెర్సటైల్ స్టార్ నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఫ్యాన్సీ ధరకు ‘విక్రమ్’ తెలుగు రాష్ట్రాల హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం జూన్ 3న తమిళంతో పాటు తెలుగులోనూ గ్రాండ్‌గా విడుదల కానుంది. టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యుషన్ సంస్థలలో ఒకటైన శ్రేష్ట్ మూవీస్ ‘విక్రమ్’ సినిమాకి సంబంధించి భారీ ప్రమోషనల్ కార్యక్రమాలని ప్లాన్ చేస్తుంది. శ్రేష్ట్ మూవీస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ విక్రమ్ సినిమాని తెలుగులో భారీ స్థాయిలో విడుదల చేయడంతో సినిమా ఖచ్చితంగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిందనే చెప్పాలి. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రాఫర్ గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ప్రధాన తారాగణంతో పాటు కాళిదాస్ జయరామ్, నరైన్, అర్జున్ దాస్, శివాని నారాయణన్ ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రలలో కనిపించనున్ననారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Anasuya Bharadwaj: నయా అందాలతో ఆకట్టుకుంటున్న అను లేటెస్ట్ ఫోటోస్ వైరల్

Priyamani: ఆరెంజ్ డ్రెస్ లో మతిపోగుడుతున్న ప్రియమణి.. ఆమె అందానికి ఫిదా అవ్వాల్సిందే..

Deepika Padukone: కొర చూపులతో కవ్విస్తున్న బాలీవుడ్ స్టన్నింగ్ బ్యూటీ..