AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telugu Indian Idol: ఆ సింగర్స్ వాయిస్‌లు విని మంత్రముగ్ధుడైన దేవీ శ్రీ.. సూపర్భ్ అంటూ ప్రశంసలు..

మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సైతం తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్స్ పాడిన పాటలు విని మంత్రముగ్దులైయ్యారు..

Telugu Indian Idol: ఆ సింగర్స్ వాయిస్‌లు విని మంత్రముగ్ధుడైన దేవీ శ్రీ.. సూపర్భ్ అంటూ ప్రశంసలు..
Devi Sri Prasad
Rajitha Chanti
|

Updated on: May 19, 2022 | 8:59 PM

Share

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో టెలికాస్ట్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ రోజుకీ రోజుకీ ప్రేక్షకాధరణ పెంచుకుంటూ దూసుకుపోతుంది. కొత్త గొంతుకలను ప్రపంచానికి పరిచయం చేస్తు్న్న ఈ తెలుగు సింగింగ్ షోకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ షోకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిత్యామీనన్, కార్తిక్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్‏గా వ్యవహరిస్తున్న ఈ సింగింగ్ వేదికగా తమ ప్రతిభను చాటుతూ.. ప్రముఖులచేత ప్రశంసలు అందుకుంటున్నారు నూతన గాయని గాయకులు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సైతం తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్స్ పాడిన పాటలు విని మంత్రముగ్దులైయ్యారు.. సింగర్ వాగ్దేవి.. శ్రీనివాస్ దరిమిశెట్టి .. అల్లు అర్జున్.. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాటను అద్భుతంగా ఆలపించారు. వీరి పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అది కాస్త దేవి శ్రీ ప్రసాద్ దగ్గరకు చేరింది.

వాగ్దేవి, శ్రీనివాస్ పాట పాడిన తీరుకు దేవీ శ్రీ ప్రసాద్ ముగ్దులయ్యారు. ఈ వీడియోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తూ సూపర్ అంటూ ప్రశంసలు కురిపించారు. దేవి శ్రీ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమ పాటను మెచ్చుకోవడంతో వాగ్దేవి, శ్రీనివాస్ ఆనందం వ్యక్తంచేశారు.. గతంలో కూడా వీరి పాటలను మెచ్చుకుంటూ సినిమాలో పాడే అవకాశాలు వస్తాయంటూ తమన్ అన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక జంటగా నటించిన పుష్ప చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా.. ఇందులోని పాటలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇప్పటికీ పుష్ప పాటలు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి.

Telugu Indian Idol

Telugu Indian Idol