NTR 30: అప్డేట్ వచ్చేసింది.. సమయం వచ్చిందంటూ అదరగొట్టిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే..
అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తాను ఉండకూడదని.. అప్పుడు భయానికి కూడా తెలియాలి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR jr).. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న #NTR 30 మూవీ అప్డేట్ వచ్చేసింది. వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమా అప్డేట్ కోసం తారక్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్ నిరీక్షణకు తెర దింపారు మేకర్స్. తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి స్పెషల్ అప్డేట్ ఇచ్చారు . శుక్రవారం (మే 20) ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో #NTR 30 సినిమా నుంచి ఓ ఆసక్తికర వీడియోను రిలీజ్ చేసింది చిత్రయూనిట్..
ఆ వీడియోలో ఎన్టీఆర్ వర్షంలో నిలబడి రక్తంతో తడిసిన కత్తి పట్టుకుని “అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలియదు.. అవసరానికి మించి తాను ఉండకూడదని.. అప్పుడు భయానికి కూడా తెలియాలి. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా“.. అంటూ డైలాగ్‌తో అదరగొట్టాడు ఎన్టీఆర్. తాజాగా విడుదలైన వీడియో చూస్తూంటే.. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా యాక్షన్ నేపథ్యంలో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. నేపథ్య సంగీతం కూడా ఓ రేంజ్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు విడుదలైన వీడియోతో ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది చిత్రయూనిట్.. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నట్లుగా గతంలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అనుహ్యంగా ఇప్పుడు రష్మిక మందన్నా పేరు వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
ట్వీట్..
My next with Koratala Siva… https://t.co/iPyKSQ9Sjs pic.twitter.com/xaEB1ZbwON
— Jr NTR (@tarak9999) May 19, 2022