Frogs marriage: వాన కోసం కప్పకు తప్పని తిప్పలు.. వరుణ దేవుడిని కరుణ కోసం కప్పల పెళ్లి చేసిన గ్రామస్తులు

| Edited By: Surya Kala

Jul 31, 2024 | 7:22 AM

వ్యవసాయం కోసం సరైన సమయానికి వర్షాలు విస్తారంగా కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ , ఆదోని మండల పరిధిలోని పాడేగల్ గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం రైతుల పిల్లలు ఆదివారం కప్పలకు పెళ్లి చేశారు. ఈ సందర్భగా ముందుగా గ్రామంలో రోకలి బండ కు వేపాకులతో కట్టిన జోలెలో రెండు కప్పలను ఉంచి, ఇంటింటికీ తిరుగుతూ సేకరించిన విరాళం డబ్బులతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు

Frogs marriage: వాన కోసం కప్పకు తప్పని తిప్పలు.. వరుణ దేవుడిని కరుణ కోసం కప్పల పెళ్లి చేసిన గ్రామస్తులు
Frogs Marriage
Follow us on

ఆ గ్రామలదో ఇదో వింత సమస్య. అంతట భారీ వర్షాలతో అతలాకుతలం జరుగుతూ.. కనీ విని ఎరుగని ఆస్తి ప్రాణ నష్టం జరుగుతుంటే… అక్కడ మాత్రం వర్షాల సీతకన్నేశాయి. దీంతో ఆ గ్రామస్తులు వర్షాలు కోసం చేయని పూజ లేదు. ఆచరించని వింత ఆచారాలు లేవు. వర్షం కోసం ఎవరు ఏం చెబితే అది చేస్తున్నారు. వర్షమో రామచంద్రా అంటూ.. దేవుళ్ళ వివిధ రూపాలలో మొక్కులు తీర్చుకుంటున్నారు కానీ చినుకు జాడలేదు

ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలో వాన కోసం కప్పకు తప్పని తిప్పలు

వ్యవసాయం కోసం సరైన సమయానికి వర్షాలు విస్తారంగా కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ , ఆదోని మండల పరిధిలోని పాడేగల్ గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం రైతుల పిల్లలు ఆదివారం కప్పలకు పెళ్లి చేశారు. ఈ సందర్భగా ముందుగా గ్రామంలో రోకలి బండ కు వేపాకులతో కట్టిన జోలెలో రెండు కప్పలను ఉంచి, ఇంటింటికీ తిరుగుతూ సేకరించిన విరాళం డబ్బులతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఋతుపవనాల కదలిక ప్రకారం ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభం కావలసి ఉన్నా సరైన సమయానికి వర్షాలు కురవక , కనీసం విత్తనం కూడా పడలేదని, ఇప్పటికైనా త్వరగా వర్షాలు కురవాలని వరుణ దేవుని ప్రార్థిస్తూ, ఆచారం ప్రకారం గ్రామస్తులు కప్పలకు పెళ్లి చేశారు. ఈ తంతు ముగిశాక బతికిన కప్పలను పూడ్చిపెట్టడం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ గ్రామంలోనే కాదు.. కోడుమూరు మంత్రాలయం నియోజకవర్గం కూడా చాలాచోట్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది. విత్తనాలు వేయాలని, వేసిన పంటలు ఎండకుండా వర్షాలు కురవాలంటూ పూజలు ప్రార్థనలు వింత ఆచారాలు చేస్తున్నారు. ప్రజలు బాధితుల ఆశలు పూజలు ఫలించి వర్షాలు కురవాలని ఆశిద్దాం

భూమిలో గింజలు వేసిన వర్షాలు రాకపోవడంతో వానదేవుడి కరుణ కోసం ప్రజలు వివిధ రకాల్లో పూజలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో వర్షాలు కూరవాలని గ్రామంలో ఉన్న చింతలమునిస్వామి ఆలయంలో ఉన్న బావి లో నీళ్లు తోడుకొని గ్రామ నడిబొడ్డున ఉన్న బొడ్రాయి, నాగదేవత ప్రతిమలకు జాలాభిషేకం నిర్వహించారు. ఋతుపవనాల కదలిక ప్రకారం ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభం కావలసి ఉన్నా సరైన సమయానికి వర్షాలు కురవక, కనీసం విత్తనం కూడా పడలేదని, ఇప్పటికైనా త్వరగా వర్షాలు కురవాలని వరుణ దేవుని ప్రార్థిస్తూ, ఆచారం ప్రకారం ఇలా వరుణుడి కోసం పూజలు చేస్తున్నామని గ్రామస్తులు తెలిపారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..