Bear: బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!

Bear: బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!

Anil kumar poka

|

Updated on: Jul 31, 2024 | 8:28 AM

ఇటీవల వన్యప్రాణులు అడవులను వదిలి ఆహారం, నీటి కోసం జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఈ క్రమంలో మనుషులపై దాడులకు సైతం పాల్పడుతున్నాయి. పుణ్యక్షేత్రాలు, పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ భక్తులను భయాందోళనకు గురిచేస్తున్న జంతువులు ఇప్పుడు ఇళ్లలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాయి. రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి సమీపంలోని ఓ ఇంటి ప్రహరీగోడ దూకి చిరుత ఇంటి ఆవరణలోకి చొరబడింది.

ఇటీవల వన్యప్రాణులు అడవులను వదిలి ఆహారం, నీటి కోసం జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. ఈ క్రమంలో మనుషులపై దాడులకు సైతం పాల్పడుతున్నాయి. పుణ్యక్షేత్రాలు, పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ భక్తులను భయాందోళనకు గురిచేస్తున్న జంతువులు ఇప్పుడు ఇళ్లలోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాయి. రెండు రోజుల క్రితం శ్రీకాళహస్తి సమీపంలోని ఓ ఇంటి ప్రహరీగోడ దూకి చిరుత ఇంటి ఆవరణలోకి చొరబడింది. ఆ ఇంట్లోని రెండు పెంపుడు కుక్కలను చంపేసింది. తాజాగా అనంతపురం జిల్లాలో బిస్కెట్ల గోడౌన్‌లోకి ఎలుగుబంటి చొరబడింది.

జిల్లాలోని కల్యాణదుర్గంలో ఓ ఎలుగుబంటి జనావాసాల్లోకి చొరబడింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో దొడగట్టరోడ్‌ మార్కెట్‌ యార్డ్‌ ఎదురుగా ఉన్న బిస్కెట్‌ ఫ్యాక్టరీ గోడౌన్‌లోకి ప్రవేశించింది భల్లూకం. 20 నిమిషాలపాటు సంచరించిన ఎలుగుబంటి..చివరకు తలుపులు పగులగొట్టి బిస్కెట్‌ బాక్సులు చించిపారేసింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలో రికార్డయ్యాయి. చుట్టూ జనావాసాలు ఉన్నా చీకటిపడితే చాలు ఎలుగుబంట్ల బెడద ఎక్కువైందని స్థానికుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళ కాలనీ, పూర్ణానంద ఆశ్రమం పరిసరాల్లో అనునిత్యం ఎలుగుబంటి సంచారం ఎక్కువైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫారెస్టు సిబ్బంది చొరవ తీసుకోవాలని ఎలుగుబంట్ల బెడదనుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.