Rythu Runa Mafi: తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!
తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. జూలై 30న రెండో విడత రుణమాఫీ చేయనుంది. మొదటి విడతలో భాగంగా రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో 6వేల 98 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. జూలై 30న రెండో విడతలో భాగంగా లక్షన్నర వరకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తారు. ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో.. 2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. జూలై 30న రెండో విడత రుణమాఫీ చేయనుంది. మొదటి విడతలో భాగంగా రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది కాంగ్రెస్ సర్కార్. 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లో 6వేల 98 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. జూలై 30న రెండో విడతలో భాగంగా లక్షన్నర వరకు రుణమాఫీ నిధులు విడుదల చేస్తారు. ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో.. 2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో రైతుల రుణమాఫీ కోసం మొత్తం 31 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ రూ.2 లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చింది. జూలై 18న తొలి విడత రుణమాఫీని అమలు చేశారు. లక్షలోపు రుణాలు తీసుకున్న రైతుల ఖాతాల్లోకి సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల చేశారు. మరో రెండు విడతల్లో రూ. 2 లక్షల వరకు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. అయితే లక్షన్నర లోపు రెండో విడతలోను… రూ.లక్షన్నర నుంచి రూ. 2 లక్షల వరకు మూడో విడతలోను రుణమాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే రెండో విడత రుణమాఫీ కోసం రైతులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
జులై 31లోపే రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించగా.. తాజాగా తేదీ ఫిక్స్ అయింది. జులై 30 రెండో విడత రైతు రుణమాఫీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండో విడతలో లక్షన్నర వరకు రుణాలు మాఫీ చేయనున్నట్లు వెల్లడించింది. అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేసి రైతుల అకౌంట్లలోకి నిధులు విడుదల చేయనున్నారు. అనంతరం రైతు రుణమాఫీపై అసెంబ్లీలో చర్చ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. రెండో విడత కోసం నిధుల విడుదల తర్వాత అసెంబ్లీ స్పీకర్‌కు చర్చకు సంబంధించిన తీర్మానాన్ని ఇవ్వనున్నట్లు సమాచారం.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.