Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో ఇంట్రస్టింగ్ సీన్స్.. లైవ్ వీక్షించండి
అసెంబ్లీ వేదికగా భట్టివిక్రమార్క, రేవంత్‌రెడ్డిపై విచిత్రమైన కామెంట్స్ చేశారు కేటీఆర్. రేవంత్‌రెడ్డి సభలో లేనప్పుడు భట్టివిక్రమార్కపై పొగడ్తల వర్షం కురిపించారు. డిప్కూటీ సీఎం సీట్లో నుంచి సీఎం సీట్లోకి భట్టి మారాలని, భవిష్యత్‌లో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. రేవంత్‌రెడ్డి సభకు రాగానే... ఆయనపైనా ఇదే తరహా కామెంట్స్ చేశారు. ఐదేళ్లూ రేవంత్‌రెడ్డే... ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నా అన్నారు కేటీఆర్.
తెలంగాణ అసెంబ్లీలో ఇంట్రస్టింగ్ సీన్స్ కనిపిస్తున్నాయి. – సభా నాయకుడిని KTR ఏకవచనంతో సంభోదించారంటూ కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీనిపై స్వల్ప వాగ్వాదం జరిగింది. KTR తన మాటలు వెనక్కి తీసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. తమ విద్యార్హతలపై కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య సంవాదం జరిగింది. రేవంత్ విద్యార్హతపై కేటీఆర్ కామెంట్ చేయగా.. అందుకు కౌంటర్ ఇచ్చారు సీఎం. అసెంబ్లీ వేదికగా ప్రభుత్వానికి సవాల్ విసిరారు కేటీఆర్. కొత్తగా ఒక్క ఉద్యోగం ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ శపథం చేశారు. కేటీఆర్ సవాల్‌కి సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు సీఎం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Jul 31, 2024 12:50 PM
వైరల్ వీడియోలు
Latest Videos