Andhra Pradesh: ప్రకృతి సేద్యంలో మాజీ డిప్యూటీ సీఎం.. బిజీగా ఉన్నా విరామ సమయంలో ఇలా..!

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి(Pushpa Srivani) ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో మునిగిపోయారు. ఇటీవల సీఎం జగన్‌(CM Jagan) చేపట్టిన కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో పుష్ప శ్రీవాణి గిరిజన శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో మునుపటి కన్నా...

Andhra Pradesh: ప్రకృతి సేద్యంలో మాజీ డిప్యూటీ సీఎం.. బిజీగా ఉన్నా విరామ సమయంలో ఇలా..!
Pushpa

Updated on: Apr 18, 2022 | 4:57 PM

ఏపీ మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి(Pushpa Srivani) ఇప్పుడు ప్రకృతి వ్యవసాయంలో మునిగిపోయారు. ఇటీవల సీఎం జగన్‌(CM Jagan) చేపట్టిన కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో పుష్ప శ్రీవాణి గిరిజన శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో మునుపటి కన్నా ఇప్పుడు కాస్త సమయం దొరకడంతో ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో(Organic) సొంతంగా కూరగాయాల పెంపకం చేపట్టారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి గ్రామంలో ఉన్న తన ఇంటి ఆవరణలో పెరటి తోట పెంచుతున్నారు. సుమారు 20 సెంట్ల స్థలంలో క్యారెట్‌, బీట్‌రూట్‌, ముల్లంగి, క్యాబేజీ, టమాటా, వంగ, ఆకుకూరలు సాగు చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకున్నారు. ‘మా ఇంటి పెరటిలో ఎటువంటి ఎరువులు వాడకుండా.. సహజసిద్దంగా పండించిన కూరగాయలు. పంట చేతికొచ్చి కూరగాయలు కోసినపుడు చాలా ఆనందంగా ఉంది. బయటి మార్కెట్లో రసాయన ఎరువులు వినియోగించి పండించిన కూరగాయలు లభిస్తుండడంతో సేంద్రియ పద్ధతిలో పండించాలని నిర్ణయించాను. ప్రకృతి సాగు వల్ల భూసారం పాడవ్వకుండా, నాణ్యమైన దిగుబడి వస్తుందని, ఆ పంటలు ఆర్యోగానికీ మేలు చేస్తాయని పుష్ప శ్రీవాణి చెబుతున్నారు.

మొన్నటి వరకు డిప్యూటీ సీఎం హోదాలో ఓవైపు అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నా సరే.. అప్పుడప్పుడు దొరికే కొంత సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకున్నారు. ఇంటి ఆవరణలో పెరటి తోటతో సాగు చేశారు. కూరగాయలు కూడా మంచి దిగుబడి వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పుష్పశ్రీవాణి తన తోటలో టమాటాలు తెంపుతున్న దృశ్యాలను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Also Read

Hyderabad: హైదరాబాద్‌ నగర వాసులకు గుడ్‌ న్యూస్‌.. అందుబాటులోకి మరో ఫ్లైఓవర్‌..

Telangana: కోదాడలో దారుణం.. మూడు రోజులుగా అత్యాచారం.. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి..

Royol Bengal Tiger: బోట్‌లో తరలిస్తుండగా నీటిలో దూకిన పులి.. వైరల్‌గా మారిన వీడియో..