Hyderabad: హైదరాబాద్ లో చల్లబడిన వాతావరణం.. మరికొద్ది సేపట్లో వర్షం కురిసే అవకాశం
హైదరాబాద్(Hyderabad) లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భానుడి భగభగలతో అల్లాడిపోయిన నగరవాసులు చల్లని వాతావరణంలో ఉపశమనం లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు(Rains)....
హైదరాబాద్(Hyderabad) లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భానుడి భగభగలతో అల్లాడిపోయిన నగరవాసులు చల్లని వాతావరణంలో ఉపశమనం లభించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు, మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు(Rains) కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు(Weather Report) వెల్లడించారు. నగరంలోని సూరారం, జీడిమెట్ల, గాజులరామారం, షాపూర్‌నగర్, బహదూర్‌పల్లి, కొంపల్లి, బాచుపల్లి, ప్రగతినగర్, నిజాంపేట్ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతే కాకుండా రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. గాలులు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఉపరితల ద్రోణి విదర్భ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి మీ ఎత్తు వద్ద కొనసాగుతోందని వివరించారు.
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి దిశలో గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
Also Read
Hansika motwani: వన్నె తగ్గని గ్లామర్ తో కవ్విస్తున్న అందాల ముద్దుగుమ్మ హన్సిక లేటెస్ట్ ఫొటోస్..