Hyderabad: బంజారాహిల్స్ భూవివాదంలో మరో మలుపు.. ఏ5గా ఏపీ ఎంపీ..
తీవ్ర కలకలం రేపిన హైదరాబాద్ బంజారాహిల్స్ భూవివాదం(Banjara Hills land dispute case ) కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు రిమాండ్ రిపోర్ట్‌ను టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. ఇందులో ఎంపీ టీజీ వెంకటేష్‌ను(MP TG Venkatesh) ఏ5గా చేర్చారు పోలీసులు.
తీవ్ర కలకలం రేపిన హైదరాబాద్ బంజారాహిల్స్ భూవివాదం కేసు (Banjara Hills land dispute case ) కొత్త మలుపు తిరిగింది. ఈ కేసు రిమాండ్ రిపోర్ట్‌ను టీవీ9 ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. ఇందులో ఎంపీ టీజీ వెంకటేష్‌ను(MP TG Venkatesh) ఏ5గా చేర్చారు పోలీసులు. మొత్తం 80 మంది నిందితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్‌ను ఐదో నిందితుడిగా పేర్కొన్నారు పోలీసులు. మూవీ స్టైల్లో భూ కబ్జా ఇష్యూ టర్న్ తీసుకుంది. వాళ్లంతా వెళ్లింది భూకబ్జా కోసం కాదట, సినిమా ఆఫీస్ ఓపెనింగ్ కోసం వెళ్లారట. పైగా వాళ్లంతా రౌడీలు కాదంటున్నారు టీజీ వెంకటేష్ సోదరుడు విశ్వప్రసాద్. వాళ్ల దగ్గర ఎలాంటి ఆయుధాల్లేవని, ఎవరిపైనా దాడి చేయలేదంటూ వీడియోలు కూడా రిలీజ్ చేశారు విశ్వప్రసాద్.
టీజీ వెంకటేష్ సోదరుడు విశ్వప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. తమ వాళ్ల దగ్గర ఎలాంటి కత్తులు, హాకీ బ్యాట్స్ లేవన్నారు విశ్వప్రసాద్. పోలీసులే వాటిని ఆ ల్యాండ్‌లో పెట్టారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అక్కడికి వచ్చిన వాళ్లంతా రౌడీలు కాదు, తమ బంధువులేనంటూ క్లారిటీ ఇచ్చారు విశ్వప్రసాద్. దాంతో, బంజారాహిల్స్ భూవివాదం కొత్త మలుపు తిరిగినట్టైంది.
అసలు, ఆ భూమి తమదేనంటున్నారు టీజీ వెంకటేష్ సోదరుడు విశ్వప్రసాద్. కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉందంటున్నారు.
ఉమ్మడి ఏపీలో జెమ్స్ అండ్ జువెలరీ పార్క్ కంపెనీకి రెండెకరాల 5గంటల భూమిని కేటాయించడం జరిగిందంటున్నారు రెవెన్యూ అధికారులు. అయితే, గడువులోగా అక్కడ కన్‌స్ట్రక్షన్స్ కంప్లీట్ కాకపోవడంతో తిరిగి ఆ భూమిని తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు.
బంజారాహిల్స్ భూవివాదంతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు ఎంపీ టీజీ వెంకటేష్ తనయుడు భరత్. FIRలో కూడా తన తండ్రి పేరు లేదన్నారు. కష్టపడి తెచ్చుకున్న పేరును చెడగొట్టవద్దని విజ్ఞప్తి చేశారు.
బంజారాహిల్స్ ల్యాండ్ కేసులో మొత్తం 84మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీజీ వెంకటేష్ సోదరుడు విశ్వప్రసాద్, వీవీఎస్ శర్మ, సుభాష్, మిథున్‌కుమార్ సహా 80మంది ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. స్పాట్‌లో 50మందికి పైగా నిందితులను అదుపులోకి తీసుకోగా, మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. అరెస్ట్ చేసిన నిందితులకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
ఇవి కూడా చదవండి: Stock Market: రూ. 2.56 లక్షల కోట్ల సంపద క్షణాల్లో ఆవిరి.. భారీగా పడిపోయిన ఇన్ఫోసిస్ షేర్లు..
Metro Trains: మెట్రో బాట పట్టిన భాగ్యనగర వాసులు.. ఆర్టీసీ చార్జీల మోతతో పెరిగిన రద్దీ..
Viral Video: ఈ పిల్లి టాలెంట్ అదుర్స్.. ఏకంగా మట్టి పాత్రలనే తయారు చేస్తోందిగా.. వీడియో వైరల్..