Andhra Pradesh: ఏపీలో ఉద్యోగుల ఇష్యూ మళ్లీ మొదటికి.. హామీలిస్తున్నారు అమలు చేయడంలేదంటూ ఎంప్లాయిస్ మండిపాటు

|

Apr 28, 2023 | 6:37 AM

ఉద్యోగులకిచ్చిన ప్రతి హామీలను మే ఫస్ట్‌ నుంచి ఒక్కొక్కటీ అమలు చేస్తామన్నారు మంత్రి బొత్స. ప్రభుత్వంతో జరిగిన చర్చలపై అనుకూల, వ్యతిరేక కామెంట్స్‌ వినిపించాయి ఉద్యోగ సంఘాలు.

Andhra Pradesh: ఏపీలో ఉద్యోగుల ఇష్యూ మళ్లీ మొదటికి.. హామీలిస్తున్నారు అమలు చేయడంలేదంటూ ఎంప్లాయిస్ మండిపాటు
Ap Employees
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల ఇష్యూ మళ్లీ మొదటికొచ్చింది. మరోసారి తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి ఉద్యోగ సంఘాలు. సమస్యలను పరిష్కరించకపోతే మరోసారి ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరించడంతో చర్చలకు పిలిచింది ప్రభుత్వం. ఉద్యోగ సంఘాలతో సమావేశమైన కేబినెట్‌ సబ్‌ కమిటీ సుదీర్ఘ చర్చలు జరిపింది. జీతాలు, రాయితీలు, బెనిఫిట్స్‌, పీఆర్సీ అండ్‌ డీఏ బకాయిలు, బదిలీలు.. ఇలా అనేక సమస్యలను ఏకరువు పెట్టారు ఉద్యోగులు. ఈభేటీలో ఉద్యోగ సంఘాలు అనేక అంశాలు లేవనెత్తాయన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మే ఫస్ట్‌ నుంచి ఇంప్లిమెంట్‌ చేయనున్నట్టు చెప్పారు మంత్రి.. పీఆర్సీ కమిటీ అపాయింట్‌పైనా కసరత్తు జరుగుతోందన్నారు బొత్స.

గతంలోనే అనేక డిమాండ్లపై సానుకూలంగా స్పందించింది ప్రభుత్వం. మొత్తం 94 ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా అప్పుడే హామీలు లభించాయి. ఇప్పుడు కూడా ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం పాజిటివ్‌గా రియాక్టైందన్నారు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి. హామీలైతే ఇస్తున్నారు, కానీ సక్రమంగా అమలు కావడం లేదన్నది ఇతర ఉద్యోగ సంఘాల మాట. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్టు చేయకపోతే మళ్లీ చర్చించుకొని కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు ఏపీ జేఏసీ అమరావతి బొప్పరాజు వెంకటేశ్వర్లు. ఉద్యోగ సంఘాలతో కేబినెట్‌ సబ్‌కమిటీ చర్చలు ఇలాగుంటే, ఇంకోవైపు ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ హైకోర్టును ఆశ్రయించడం టాక్‌ ఆఫ్‌ది ఎంప్లాయిస్‌ అయ్యింది. ఏపీ వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలంటూ ప్రభుత్వం ఇష్యూ చేసిన షోకాజ్‌పై హైకోర్టుకెళ్లారు సూర్యనారాయణ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..