AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: మహిళల కోసం స్వయం ఉపాధి పథకాలు పెంచాలి.. పంచాయితీరాజ్‌ శాఖపై సీఎం జగన్ సమీక్ష..

సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌  సమీక్ష నిర్వహించారు.  సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. మహిళల స్వయం సాధికారిత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. చేయూత, ఆసరా, కాపు..

CM Jagan: మహిళల కోసం స్వయం ఉపాధి పథకాలు పెంచాలి.. పంచాయితీరాజ్‌ శాఖపై సీఎం జగన్ సమీక్ష..
Andhra Pradesh CM YS Jagan
Sanjay Kasula
|

Updated on: Apr 27, 2023 | 9:57 PM

Share

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌  సమీక్ష నిర్వహించారు.  సందర్భంగా పలు కీలక సూచనలు చేశారు. మహిళల స్వయం సాధికారిత కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం లాంటి పలు పథకాల ద్వారా వారికి జీవనోపాధి కల్పించే మార్గాలను మరింత విస్తృతం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. చేయూత కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందని సీఎం జగన్ స్పష్టం చేశారు. అలానే ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా నిర్ణయించిన వ్యవధి మేరకు క్రమం తప్పకుండా వారికి ఆర్థిక సహాయం అందుతుందని సీఎం జగన్ అన్నారు. ఈ డబ్బు వారి జీవనోపాధికి ఉపయోగపడేలా ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకుల సహాయంతో స్వయం ఉపాధి మార్గాలను అమలు చేస్తోందని, దీన్ని మరింత విస్తృతం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.

చేయూత కింద అర్హత సాధించిన లబ్ధిదారులకు వరుసగా నాలుగేళ్లపాటు క్రమం తప్పకుండా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోందన్న సీఎం. అలానే ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాల కింద కూడా నిర్ణయించిన వ్యవధి మేరకు క్రమం∙తప్పకుండా వారికి ఆర్థిక సహాయం అందుతుందన్న సీఎం. ఈ డబ్బు వారి జీవనోపాధికి ఉపయోగపడేలా ఇప్పటికే ప్రభుత్వం బ్యాంకుల సహాయంతో స్వయం ఉపాధి మార్గాలను అమలు చేస్తోందన్న ముఖ్యమంత్రి.

దీన్ని మరింత విస్తృతం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం. లబ్ధిదారులకు పథకాన్ని అందుకునే మొదటి ఏడాదినుంచే వారిని స్వయం ఉపాధి మార్గాలవైపు మళ్లించే కార్యక్రమాలను మరింత పెంచాలని, దీనివల్ల గ్రామ స్థాయిలో సుస్థిర ఆర్థిక ప్రగతి దిశగా వేగంగా అడుగులుపడతాయన్న సీఎం. అర్హులైన మహిళల్లో మరింత అవగాహన కల్పించి బ్యాంకుల నుంచి కూడా రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించే మార్గాలను సమర్థవంతంగా కొనసాగించాలన్న సీఎం.

మహిళలు తయారు చేస్తున్న వస్తువులు, ఉత్పాదనలకు సంబంధించి మంచి మార్కెట్‌ వ్యవస్ధ ఉండాలన్న సీఎం. దీనికోసం బహుళజాతి కంపెనీలతో అనుసంధానం కావాలన్న సీఎం. 45-60 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల సాధికారతే లక్ష్యంగా చేయూత పథకం. ఇప్పటివరకూ చేయూత పథకం ద్వారా 9 లక్షలమంది స్వయం ఉపాధి పొందుతున్నారని అధికారులు వెల్లడి.

హిందుస్తాన్‌ యూనీలీవర్, ఐటీసీ లిమిటెడ్, రిలయెన్స్, అజియో, జీవీకే, మహేంద్ర, కాలాగుడి, ఇర్మా, నైనా, పీ అండ్‌ జీ వంటి అంతర్జాతీయ సంస్ధలతో ఇప్పటికే ఒప్పందాలు జరిగాయన్న అధికారులు. ఈ కార్యక్రమం ద్వారా చేయూత మహిళా మార్టు, వస్త్ర, చింతపండు ప్రాసెసింగ్‌ యూనిట్, లేస్‌ పార్కు, ఇ– కామర్స్, ఇ–మిర్చ, బ్యాక్‌ యార్డు పౌల్ట్రీ, ఆనియన్‌ సోలార్‌ డ్రయ్యర్లు ఏర్పాటు వంటి కార్యక్రమాలను చేపడుతున్నట్టు తెలిపిన అధికారులు.

గ్రామీణ ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులను మార్కెట్‌ ధర కంటే తక్కువకే అందించాలన్న లక్ష్యంతో స్వయం సహాయక సంఘాల మహిళలతో సూపర్‌ మార్కెట్‌లు ఏర్పాటు. జిల్లాకు కనీసం రెండు సూపర్‌ మార్కెట్‌లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపిన అధికారులు. మొత్తం 27 చేయూత మహిళా మార్టులు ఏర్పాటు. ఒక్కో సూపర్‌ మార్టులో కనీసం నెలకు రూ.30 లక్షలు టర్నోవర్‌ లక్ష్యంగా ఏర్పాటు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు డోర్ డెలివరీ, ఆన్‌లైన్ బుకింగ్‌, వాట్సప్ బుకింగ్ సౌకర్యా్ని అందుబాటులోకి తెస్తున్నామన్న అధికారులు. మల్టీ నేషన్‌ కంపెనీలతో భాగస్వామ్యం వల్ల వారి ఉత్పత్తుల్లో కనీసం 8 నుంచి 25 శాతం మార్జిన్‌ ఉండేట్టు ఏర్పాటు చేశామని వెల్లడి.

కాకినాడ జిల్లాలో సామర్లకోటలో వస్త్ర పేరుతో ఏర్పాటు చేసిన దుస్తుల తయారీ యూనిట్‌లో 200 మంది మహిళలకు ఉపాధి. ట్రెండ్స్, అజియో వంటి కంపెనీలతో ఒప్పందం. చిత్తూరు జిల్లా కురుబలకోటలో చింతపండు ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 3వేల కుటుంబాలకు చేయూత.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై