AP Exams: సుప్రీం కోర్టు సూచనల మేరకు.. విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చివరి క్షణం వరకు పరీక్షలను నిర్వహించాలనే నిశ్చయంతో ఉన్న ఏపీ ప్రభుత్వం సుప్రీం సూచనల మేరకు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే ఇంటర్, టెన్త్ ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు అధికారులకు తెలిపారు. పరీక్షా ఫలితాల కోసం ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇక కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో విద్యా సంస్థల పునఃప్రారంభం విషయంలో లోతుగా పరిశీలన చేయాలని మంత్రి సూచించారు. ఈ క్రమంలోనే వచ్చే అకడమిక్ ఇయర్ (2021-2022) క్యాలెండర్‌ను రూపొందించాలని, పరిస్థితులకు అనుగుణంగా తరగతలు నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో ఆలోచించాలని అధికారులకు తెలిపారు. ఇక ఇదిలా ఉంటే ఏపీలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకుగాను.. ‘ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన’(సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్–సాల్ట్)’ అనే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. స్టాల్‌తో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
కరోనా ఆస్పత్రి అత్యవసర వార్డులో ముగ్గురు మృతి.. ఆక్సిజన్ అందకనే మృతి చెందినట్లు ఓ కుటుంబం ఆందోళన
Two Wheeler Sales: టూ వీలర్ల విక్రయాల్లో కొత్త రికార్డు… భారత దేశ చరిత్రలో ఇదే తొలిసారి…