ఆటగదరా శివ.! ఇంటికి వెళ్తుండగా దారి కాచిన మృత్యువు.. అసలు ఏం జరిగిందంటే?

అల్లూరి ఏజెన్సీలో జరిగిన ఒక విషాద ఘటన గిరిజన కుటుంబాలకు కడుపుకోత మిగిల్చింది. అప్పటివరకు సరదాగా ఆడుతూ, పాడుతూ తిరిగిన చిన్నారులను ఓ నీటి కుంట మింగేసింది. పొలం పనులకు వెళ్తుంటే వెంటపడిన ఆ చిన్నారులను తల్లిదండ్రులు తిరిగి వెనక్కి పంపగా.. వెళ్లే దారిలో ఉన్న నీటి కుంటలోకి దిగిన చిన్నారులు.. లోతు ఎక్కువగా ఉండడంతో మునిగి ప్రాణాలు కోల్పోయారు. హుకుంపేట మండలం ఉప్పదిగవూరులో ఈ విషాదకర ఘటన వెలుగు చూసింది.

ఆటగదరా శివ.! ఇంటికి వెళ్తుండగా దారి కాచిన మృత్యువు.. అసలు ఏం జరిగిందంటే?
Alluri District Tragedy

Edited By:

Updated on: Aug 18, 2025 | 5:38 PM

పొలం పనులకు వెళ్తుంటే వెంటపడిన ఆ చిన్నారులను తల్లిదండ్రులు తిరిగి వెనక్కి పంపగా.. వెళ్లే దారిలో ఉన్న నీటి కుంటలోకి దిగి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అల్లూరి జిల్లాలోని హుకుంపేట మండలం పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఉప్ప దిగవూరు గ్రామానికి చెందిన పాతుని నాగేంద్ర పాత్రుడు, వెంకటేష్ ఇద్దరూ రైతు కూలీలు. వీరు పొలం పనులకు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. రోజు మాధురిగానే పొలం పనులకు ఇంటి నుంచి బయల్దేరారు. దీంతో వారి వెంటే నాగేంద్ర పాత్రుడు కొడుకు మూడేళ్ల లిఖిత్ పాత్రుడు, వెంకటేష్ కొడుకు తామర్ల హర్షవర్ధన్ వెళ్లారు.

ఇద్దరు పిల్లలు తమ తల్లిదండ్రులతో పొలం పనుల దగ్గర వెళ్లారు. అయితే సడెన్గా వర్షం రావడంతో పిల్లలిద్దరిని తమ ఇళ్లకు వెళ్ళమని వాళ్ల దగ్గర ఉన్న గొడుగులు ఇచ్చి కొంతవరకు పంపించారు తల్లిదండ్రులు. ఆ తరువాత వారంతా పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఇంటికి వెళ్తున్న ఇద్దరు పిల్లలు దారి మధ్యలో కొంతమంది పిల్లలతో కలిసి గ్రామానికి సమీపాన ఉన్న నీటి కుంటలో ఈతకు దిగారు. నీటి కుంట లోతు ఎక్కువగా ఉండడంతో ఇద్దరు చిన్నారులు నీట మునిగి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు.

ఈ విషయం తెలియక సాయంత్రం ఇంటికి వచ్చన తల్లిదండ్రులు లిఖిత్, హర్షవర్ధన్ కోసం గ్రామం మొత్తం వెతికారు. అయితే తమ ఇంటికి సమీపాన ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లిచూడగా.. అక్కడ ఆ పిల్లలు విగతాజీవులై కనిపించారు. హుటాహుటిన వారిని బయటకు తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారులు మృతి చెందారని ఆసుపత్రి సిబ్బంది ధ్రువీకరించారు. దీంతో ఆ తల్లిదండ్రులు తల్లాడ ఇల్లు పోయారు. ఇద్దరూ చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిన గ్రామం తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.