Dhanalakshmi Idol: రెండు కోట్ల నోట్ల కట్లతో అలంకరించిన ధనలక్ష్మి అమ్మవారు.. చూస్తే కళ్లు చెదరాల్సిందే!

| Edited By: Srilakshmi C

Oct 18, 2023 | 6:59 PM

డబ్బు ఓ మ్యాజిక్..ఉన్నవాడికి తరగదు, లేని వాడి దగ్గర మిగలదు. అలాంటి డబ్బు కోసం ప్రతి మనిషి నిరంతరం శ్రమిస్తారు. డబ్బు ద్వారా లభించే సుఖం, సౌఖ్యం, భోగం ఇవన్నీ మనిషిని విలాసవంతునిగా మార్చేస్తాయి. అదే డబ్బు సమాజంలో హోదాను ధనవంతుడనే పేరును తెచ్చి పెడుతుంది. ఇక దాని కోసం భగవంతుడు ముందు సాష్టాంగ పడి చేసే ప్రతి పనిలో కలిసి రావాలని, ధనవ్రృద్ధి జరగాలని కోరుకుంటారు. ఇక ధనానికి ప్రతి రూపం లక్ష్మి దేవి. ఆమె ఉన్న చోట..

Dhanalakshmi Idol: రెండు కోట్ల నోట్ల కట్లతో అలంకరించిన ధనలక్ష్మి అమ్మవారు.. చూస్తే కళ్లు చెదరాల్సిందే!
decorated Dhanalakshmi Idol with RS 2 crores
Follow us on

ఏలూరు, అక్టోబర్‌ 18: డబ్బు ఓ మ్యాజిక్..ఉన్నవాడికి తరగదు, లేని వాడి దగ్గర మిగలదు. అలాంటి డబ్బు కోసం ప్రతి మనిషి నిరంతరం శ్రమిస్తారు. డబ్బు ద్వారా లభించే సుఖం, సౌఖ్యం, భోగం ఇవన్నీ మనిషిని విలాసవంతునిగా మార్చేస్తాయి. అదే డబ్బు సమాజంలో హోదాను ధనవంతుడనే పేరును తెచ్చి పెడుతుంది. ఇక దాని కోసం భగవంతుడు ముందు సాష్టాంగ పడి చేసే ప్రతి పనిలో కలిసి రావాలని, ధనవ్రృద్ధి జరగాలని కోరుకుంటారు. ఇక ధనానికి ప్రతి రూపం లక్ష్మి దేవి. ఆమె ఉన్న చోట శ్రీ అంటే సిరి తాండవిస్తుంది. కనకవర్షం కురుస్తుంది. అందుకే దసరా నవరాత్రుల్లో ధనలక్ష్మిని అమ్మవార్లకు ప్రత్యేకంగా అలంకరించి భక్తులు పూజిస్తారు. ఇలా జంగారెడ్డిగూడెం లో అమ్మవారిని రూ.2కోట్లతో అలంకరించారు కమిటీ సభ్యులు. ఆ నోట్ల కట్టలు చూసి భక్తులు కళ్లు తిప్పు కోలేకపోయారంటే నమ్మండి.

డబ్బు అంటే ధనానికి అధిపతిగా లక్ష్మీదేవినీ పూజిస్తుంటారు. ఆమె ఆశీస్సులు మెండుగా ఉన్నవారికి ఏటువంటి ఆర్థిక సమస్యలు ఉండవని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లాలో గత నాలుగు రోజులుగా ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. జంగారెడ్డిగూడెంలో శ్రీ గంగానమ్మ ఆలయంలో జరిగే దసరా ఉత్సవాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతిరోజు అమ్మవారి వివిధ అలంకారాలలో అలంకరించి పూజలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే నాలుగో రోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. మహాలక్ష్మి అలంకరణ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు అమ్మవారిని రూ.2 కోట్ల కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించారు.

రూ. 50, రూ.100, రూ.200, రూ.500 కొత్త నోట్లతో అమ్మవారి ఆలయ చుట్టూ ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే నిడమర్రు మండలం మందలపర్రు శ్రీఉమానీలకంఠేశ్వర స్వామి పంచాయతన క్షేత్రంలో దేవీశరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో నాలుగవ రోజు శ్రీ ఉమాదేవి అమ్మవారు ధనలక్ష్మీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రూ.50లక్షల విలువగల కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. గ్రామస్తుల సహకారంతో ధనలక్ష్మి అలంకరణలో రూ.500, రూ .200, రూ.100 కొత్త కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అయితే కొత్త కరెన్సీ నోట్లతో అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళుతున్నారు. అలాగే అమ్మవారి దయ, కృప, ఆశీస్సులు తమకి ఎల్లప్పుడూ ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.