AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM YS Jagan: ఢిల్లీలో రెండోరోజు ఏపీ సీఎం జగన్‌.. అమిత్ షాతో భేటీ అయ్యే ఛాన్స్..!

Delhi, Ocober 06: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడిపారు. తొలిరోజు కేంద్ర మంత్రులతో సమావేశమై పలు అంశాలపై చర్చించిన ఆయన.. ఇవాళ రాత్రి కేంద్ర హోం మంత్రి షాతో భేటీ కానున్నారు జగన్‌. రాత్రి 8 గంటల తర్వాత హోంమంత్రితో భేటీ ఉంటుందని తెలుస్తోంది. ఈ భేటీలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలకు..

CM YS Jagan: ఢిల్లీలో రెండోరోజు ఏపీ సీఎం జగన్‌.. అమిత్ షాతో భేటీ అయ్యే ఛాన్స్..!
CM YS Jagan
Shiva Prajapati
|

Updated on: Oct 06, 2023 | 7:45 AM

Share

Delhi, Ocober 06: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా గడిపారు. తొలిరోజు కేంద్ర మంత్రులతో సమావేశమై పలు అంశాలపై చర్చించిన ఆయన.. ఇవాళ రాత్రి కేంద్ర హోం మంత్రి షాతో భేటీ కానున్నారు జగన్‌. రాత్రి 8 గంటల తర్వాత హోంమంత్రితో భేటీ ఉంటుందని తెలుస్తోంది. ఈ భేటీలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు రాజకీయపరమైన చర్చ జరిగే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్, చంద్రబాబు అరెస్ట్‌పైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

గురువారం నాడు పర్యటనలో భాగంగా సీఎం జగన్.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌తో సుమారు 45 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీలో పోలవరం ప్రాజెక్టు గురించి ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతంలో కేటాయించిన మొత్తాన్ని మరో రూ. 10,500 కోట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే పెంచిన అంచనా వ్యయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే తప్ప నిధులు విడుదల చేయడం సాధ్యపడదు. వీలైనంత త్వరలో ఆర్థిక శాఖ దీనిపై సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఆ వెంటనే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి జగన్ ఈ అంశంపై కేంద్ర మంత్రితో చర్చించారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ. 55,548.87 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తుచేసిన సీఎం, దీనికి ఆమోదం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

ఇవి కూడా చదవండి

పోలవరంతో పాటు ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై కూడా ఆయన నిర్మలా సీతారామన్‌తో చర్చించినట్టు తెలిసింది. ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ దర్యాప్తు చేపట్టక ముందే కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని జీఎస్టీ, ఈడీ సంస్థలు విచారణ జరిపి కొందరిని అరెస్టు కూడా చేశాయి. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల మేరకు జరిగిన నేరాలపై సీఐడీ దర్యాప్తు చేస్తుండగా, ఇందులో చోటుచేసుకున్న మనీ లాండరింగ్ అంశాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ కొందరిని అరెస్టు చేసి, ఆస్తులను అటాచ్ చేసిందని, మనీలాండరింగ్ అంతిమ లబ్దిదారుడు చంద్రబాబు నాయుడే కాబట్టి ఈడీ దర్యాప్తు మరింత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సీఎం జగన్ కేంద్ర ఆర్థిక మంత్రితో చెప్పినట్టు తెలిసింది.

ఆ తర్వాత జగన్‌ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ నివాసానికి వెళ్లి ఆయనతో గంట సేపు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ బకాయిల రూపంలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.7,359 కోట్లు చెల్లించాల్సి ఉందని సీఎం తెలిపారు. 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌వరకూ సరఫరా చేసిన విద్యుత్‌ ఛార్జీలను ఇప్పటికీ చెల్లించలేదనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ మీడియాతో మాట్లాడారు. ఆర్డీఎస్ఎస్ పథకానికి ఆంధ్రప్రదేశ్ అర్హత సాధించిందని, ఆ పథకం కింద అందించే ఆర్థిక సహాయం గురించి చర్చించామని చెప్పారు. అయితే తెలంగాణ విద్యుత్ బకాయిలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పటికీ.. ఆయన సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. ఇకపోతే, కోవిడ్-19, వరదలు వంటి వివిధ కారణాలతో ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతున్న నేపథ్యంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు సీఎం జగన్.

వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సదస్సుకు హాజరు..

ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ పర్యటన చేపట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కాసేపట్లో వామపక్ష తీవ్రవాద నిర్మూలన సదస్సులో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కలిసి పెండింగ్ అంశాల గురించి చర్చించడం కోసం ఒక రోజు ముందుగానే ఢిల్లీ చేరుకున్నారు. అయితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆయన తొలిసారిగా ఢిల్లీ చేరుకోవడంతో ఈ పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అరెస్టుతో ఒక్కసారిగా మారిన రాజకీయ పరిణామాలు, అరెస్టు వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హస్తం కూడా ఉందన్న ఆరోపణల నేపథ్యంలో జగన్ ఢిల్లీ పెద్దలతో జరిపే చర్చలు ఆసక్తికరంగా మారాయి. రాత్రి 8 గంటల తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జగన్‌ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు రాజకీయపరమైన చర్చ జరిగే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..