AP CM YS Jagan: నేడు భువనేశ్వర్‌‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్‌.. పెండింగ్‌ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రుల చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి రేపు ఒడిశా రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో సమావేశమవుతున్నారు.

AP CM YS Jagan: నేడు భువనేశ్వర్‌‌కు ఏపీ సీఎం వైఎస్ జగన్‌.. పెండింగ్‌ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రుల చర్చ
Cm Jagan Odisha Tour

Edited By: Subhash Goud

Updated on: Nov 09, 2021 | 6:43 AM

AP CM YS Jagan Odisha Tour: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి రేపు ఒడిశా రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. భువనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో సమావేశమవుతున్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్‌ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఒడిశా సీఎంతో ప్రస్థావించాల్సిన అంశాలపై తన క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో చర్చించారు జగన్‌..

ఆంధ్రా, ఒడిశాల మధ్య దీర్ఘకాలంగా అపరిశ్కృతంగా ఉన్న అంశాలపై చర్చించేందుకు నేడు భువనేశ్వర్‌ పర్యటనకు వెళుతున్నారు ముఖ్యమంత్రి జగన్‌.. రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో చర్చించబోతున్నారు.. ముఖ్యంగా వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలు చర్చకు రానున్నాయి.. ఒడిశా సీఎంతో చర్చించనున్న ఈ మూడు అంశాలపై ఇప్పటికే కసరత్తు చేసింది ఏపీ ప్రభుత్వం..

ఒడిశా ముందుకు తేవాల్సిన అంశాలపై తన క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు సీఎం జగన్‌.. సీఎస్‌ సమీర్‌శర్మ, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఏపీ వాదనను బలంగా వినిపించాలని ఈ భేటీలో నిర్ణయించారు. వంశధార నదిపై నిర్మిస్తున్న నేరడి బ్యారేజ్ పూర్తి చేయడానికి ఒడిశా ప్రభుత్వ సహకారాన్ని కోరనున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ అంశం కూడా చర్చను వచ్చే అవకాశం ఉంది. ఇటీవల కొఠియా గ్రామాల అంశం ఇరు రాష్ట్రల మధ్య చిచ్చు పెట్టింది.ఈ వివాదాలు, వాటికి పరిష్కార మార్గాలు తదితర అంశాలపై నవీన్ పట్నాయక్‌తో సీఎం జగన్చర్చించనున్నారు

సీఎం జగన్‌ మంగళవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి బయలు దేరి శ్రీకాకుళం పాతపట్నం చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు భువనేశ్వర్‌ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నివాసానికి చేరుకుంటారు.. అక్కడ రెండు రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్‌ అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 9 గంటలకు తాడేపల్లి నివాసం చేరుకోనున్నారు.

Read Also…. LK Advani: అలా ఎందుకు చేశారో ఎల్కే అద్వానీని అడగండి.. BJP నేతలకు SP నేత కౌంటర్