AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Admit Card: టర్మ్‌1 పరీక్షల అడ్మిట్‌ కార్డులను విడుదల చేయనున్న సీబీఎస్‌ఈ.. పరీక్ష మార్గదర్శకాలు కూడా..

CBSE Admit Card: కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో విద్యా వ్యవస్థలో కీలక మార్పులు జరిగిన విషయం తెలిసిందే. విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించే క్రమంలోనే ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షా విధానంలో మార్పులు చేర్పులు..

CBSE Admit Card: టర్మ్‌1 పరీక్షల అడ్మిట్‌ కార్డులను విడుదల చేయనున్న సీబీఎస్‌ఈ.. పరీక్ష మార్గదర్శకాలు కూడా..
Cbse Admit Cards
Narender Vaitla
|

Updated on: Nov 08, 2021 | 5:17 PM

Share

CBSE Admit Card: కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో విద్యా వ్యవస్థలో కీలక మార్పులు జరిగిన విషయం తెలిసిందే. విద్యార్థుల మీద ఒత్తిడి తగ్గించే క్రమంలోనే ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షా విధానంలో మార్పులు చేర్పులు చేశాయి. ఈ క్రమంలోనే సీబీఎస్‌ఈ కూడా పలు మార్పులు చేసింది. వచ్చే ఏడాది జరగబోయే పరీక్షలకు సంబంధించి మంగళవారం (నవంబర్ 9) బోర్డు కీలక ప్రకటన చేయనుంది. ఇందులో భాగంగా 2022లో జరగబోయే టర్మ్‌ 1 పరీక్షల అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టనున్నారు. విద్యర్థులు తమ టర్మ్‌ 1 అడ్మిట్ కార్డులను cbse.nic.in లేదా cbse.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

టర్మ్‌ 1 పరీక్షల్లో భాగంగా 10 మైనర్‌ పేపర్స్‌ నవంబర్‌ 17న ప్రారంభమవుతుండగా.. 12వ తరగతి పరీక్షలు నవంబర్‌ 16 నుంచి ప్రారంభమవనున్నాయి. ఇక 10వ తరగతి మేజర్‌ పరీక్షలు నవంబర్‌ 30 నుంచి, 12వ తరగతి మేజర్‌ పేపర్స్‌ డిసెంబర్‌ 1 నుంచి మొదలుకానున్నాయి. ఇదిలా ఉంటే సీబీఎస్‌ఈ 12వ తరగతిలో 114 సబ్జెక్టులు ఉండగా వీటిలో 19 మేజర్‌ సబ్జెక్ట్స్‌, మిగితావన్నీ మైనర్‌ సబ్జెక్టులు ఉండనున్నాయి. ఇక 10వ తరగతి విషయానికొస్తే 75 సబ్జెక్టుల్లో 9 మేజర్‌ సబ్జెక్ట్స్‌ ఉండగా, మిగితావి మైనర్‌ సబ్జెక్ట్‌లు.

ఇక టర్మ్‌ 1 పరీక్ష విధానంలో మల్టీపుల్‌ చాయిస్‌ రూపంలో ప్రశ్నాపత్రం ఉండనుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు ఉండనుంది. ఇక మంగళవారం సీబీఎస్‌ఈ బోర్డు.. అడ్మిట్‌ కార్డులతో పాటు 2022లో జరగబోయే టర్మ్‌ 1 పరీక్షా పత్రానికి సంబంధించిన నమూన ఓఎమ్‌ఆర్‌ షీట్లను సైతం విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నారు.

Also Read: Paytm Vijay shekhar: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పేటీఎం సీఈఓ విజయ్‌.. పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లిన నేపథ్యంలో..

CM KCR: “ఆ పథకానికి రూపాయి ఇచ్చినట్టు నిరూపిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేస్తా”

CM KCR: “ఆ పథకానికి రూపాయి ఇచ్చినట్టు నిరూపిస్తే.. సీఎం పదవికి రాజీనామా చేస్తా”

Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?