G20 Review Meeting: జీ20 సన్నాహకాలపై ప్రధాని మోదీ సమీక్ష.. కీలక సూచనలు చేసిన సీఎం జగన్..
Andhra Pradesh: జీ20 సన్నాహకాలపై ప్రధాని మోదీ సీఎంలతో సమీక్ష జరిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. భారత్‌లో జరగనున్న G-20 సదస్సు సన్నాహకాలపై
జీ20 సన్నాహకాలపై ప్రధాని మోదీ సీఎంలతో సమీక్ష జరిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. భారత్‌లో జరగనున్న G-20 సదస్సు సన్నాహకాలపై ఈ సందర్భంగా చర్చించారు. క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ హాజరయ్యారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి, ఏప్రిల్‌లో మూడు సదస్సులను ఏపీలో నిర్వహించాలనే యోచనలో ప్రధాని ఉన్నారు. జీ-20 సదస్సు సన్నాహకాలకు విశాఖపట్నం వేదిక కానుంది. జీ–20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో.. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకు సదస్సులు, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని 56 నగరాలు, పట్టణాల్లో వివిధ అంశాలకు సంబంధించి 200 సదస్సులు నిర్వహించబోతోంది. ఏపీ నుంచి విశాఖపట్నాన్ని కేంద్రం ఎంపిక చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..