Andhra Pradesh: అన్నదాతలకు తీపికబురు చెప్పిన సీఎం జగన్.. ఈ నెలలోనే వారందరికీ డబ్బులు..

|

May 04, 2023 | 1:13 PM

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తీపికబురు అందించారు. మే నెలలోనే వైఎస్‌ఆర్ రైతు భరోసాతో పాటు పంట నష్టం జరిగిన వ్యవసాయదారులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం జగన్. అర్హతల గల రైతుల జాబితాను గ్రామ సచివాలయాల్లో,,

Andhra Pradesh: అన్నదాతలకు తీపికబురు చెప్పిన సీఎం జగన్.. ఈ నెలలోనే వారందరికీ డబ్బులు..
Cm Jagan
Follow us on

అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తీపికబురు అందించారు. మే నెలలోనే వైఎస్‌ఆర్ రైతు భరోసాతో పాటు పంట నష్టం జరిగిన వ్యవసాయదారులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు సీఎం జగన్. అర్హతల గల రైతుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించి తనిఖీ పూర్తి చేయాలని పేర్కొన్నారు. పంట నష్టంపై అధికారులతో సమీక్ష జరిపిన సీఎం జగన్.. వర్షానికి దెబ్బతిన్న పంటల వివరాలు త్వరగా సేకరించి, నివేదికను అందివ్వాలని ఆదేశించారు. సీఎం ప్రకటనపై రాష్ట్ర రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.

ఇదిలాఉంటే.. వేసవి కాలంలో వర్షాకాలాన్ని తలపిస్తూ కురుస్తున్న వర్షాలతో అన్నదాత కంట కన్నీరు పెడుతున్నాడు. చేతికి అందివచ్చిన పంట నీటిలో తేలుతుదండంతో ప్రకృతి తమని కరుణించదా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ రైతన్న వేడుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ అలెర్ట్ అయింది. అన్నదాతను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. చర్యలు తీసుకోవడం సీఎం జగన్ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..