AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Jagan: మూడేళ్లుగా అగ్రస్థానంలో ఉన్నాం.. మళ్లీ వైజాగ్ లో కలుద్దాం.. ముఖ్యమంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఢిల్లీ వేదికగా జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్‌..

CM Jagan: మూడేళ్లుగా అగ్రస్థానంలో ఉన్నాం.. మళ్లీ వైజాగ్ లో కలుద్దాం.. ముఖ్యమంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Cm Jagan
Ganesh Mudavath
|

Updated on: Jan 31, 2023 | 5:52 PM

Share

ఢిల్లీ వేదికగా జరుగుతున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సదస్సు సన్నాహక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్యతో పాటు పలువురు అధికారులు సీఎం వెంట ఉన్నారు. ఇవాళ ( మంగళవారం) మధ్యాహ్నం జరిగిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు కర్టెన్ రైజర్‌ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. రాష్ట్రానికి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, 6 పోర్టులు ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. మరో 4 ఏర్పాటవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 6 ఎయిర్‌ పోర్టులు ఉన్నాయన్న ముఖ్యమంత్రి.. 3 పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయని తెలిపారు. దాదాపు 80శాతం జిల్లాలు ఈ కారిడర్లలో ఉన్నాయని వివరించారు. ఏపీ దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని సీఎం జగన్ కొనియాడారు.

2021-22 లో 11.43 వృద్ధిరేటు సాధించాం. మూడేళ్లుగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్నాం. అనేక అవార్డులు సాధించాం. తయారీ రంగంలో అనేక క్లస్టర్లు రాష్ట్రంలో ఉన్నాయి. పారిశ్రామిక వేత్తలు ఈ ర్యాంకుల నిర్ధారణలో భాగస్వాములు. అలాంటి వారి ఫీడ్‌బ్యాక్‌ నుంచి ఈ ర్యాంకులు ఇస్తున్నారు. మాకు సింగ్‌ డెస్క్‌ పోర్టల్‌ సదుపాయం ఉంది. కరెంటు, నీళ్లు విషయంలో పరిశ్రమలకు సరసమైన ధరలకే వస్తున్నాయి. రెన్యువబుల్‌ ఎనర్జీ విషయంలో ఏపీకి పుష్కలమైన వనరులు ఉన్నాయి. 33 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టులకు అవకాశం ఉంది. పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి సమస్య ఉన్నా.. ఫోన్‌కాల్‌లో అందుబాటులో ఉంటాం. మళ్లీ మనం అందరం వైజాగ్‌లో కలుసుకుంటాం.

– వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టిన వారందరికీ సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. ప్రపంచ వేదికపై రాష్ట్రాన్ని నెలబెట్టడానికి సహకారం అవసరమని కోరారు. ఈ విషయంలో ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..