AP Rains: ఏపీకి వాయుగుండం ముప్పు.. ఆ ప్రాంతాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు

|

Aug 30, 2024 | 4:54 PM

పశ్చిమ మధ్య ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతంపై బాగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వచ్చే 36 గంటల్లో..

AP Rains: ఏపీకి వాయుగుండం ముప్పు.. ఆ ప్రాంతాలకు భారీ నుంచి అతిభారీ వర్షాలు
Ap Rains
Follow us on

పశ్చిమ మధ్య ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతంపై బాగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వచ్చే 36 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా మారుతుంది. సగటు సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి.. ఇప్పుడు లోతైన అల్పపీడన కేంద్రం కచ్ తీరం, పాకిస్తాన్, ఈశాన్య అరేబియా సముద్రం, మాలెగావ్, బ్రహ్మపురి పరిసర ప్రాంతాలు, జగదల్‌పూర్, కళింగపట్నం గుండా.. ఆపై ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య ఆనుకుని వాయువ్య బంగాళాఖాతం వద్ద గల అల్పపీడనం నుంచి వెళుతుంది.

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:-
———————————-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం:-

ఈరోజు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుంచి అతిభారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:-

ఈరోజు, రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

ఇది చదవండి: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇకపై లడ్డూ కావాలంటే అది తప్పనిసరి

రాయలసీమ:-

ఈరోజు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన  ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

రేపు:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

ఎల్లుండి:-

తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..